Viral Video: కొంచెం అయితే ప్రాణం పోయేది.. చిన్నారిపై సడెన్‌గా దాడి చేసిన సముద్ర సింహం.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

కొన్ని సమయాల్లో చిన్న పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. వారికి ఏదో ఒక రూపంలో వారి ప్రాణాలకు అపాయం జరుగుతూనే ఉంటుంది.

Viral Video: కొంచెం అయితే ప్రాణం పోయేది.. చిన్నారిపై సడెన్‌గా దాడి చేసిన సముద్ర సింహం.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 14, 2022 | 11:55 AM

Sea Lion Attacks Little Girl: సోషల్ మీడియాలో నిత్యం ఏన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన ఫన్నీ, ఆశ్చర్యకరమైన వీడియోలు ఉంటాయి. సాధారణంగా చిన్న పిల్లలు ముచ్చటపడి జంతువులతో ఆడుకోవడం సరదాగా ఉంటుంది. కొన్ని సమయాల్లో చిన్న పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. వారికి ఏదో ఒక రూపంలో వారి ప్రాణాలకు అపాయం జరుగుతూనే ఉంటుంది. క్షణ కాలంలో తీవ్రగాయాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. తాజాగా ఓ తండ్రి అజాగ్రత్త కారణంగా తన కూతురు కొద్దిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో తండ్రిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ వీడియోలో.. ఓ చిన్నారి రోడ్డుపై ఉన్న సముద్ర సింహంపై ఎక్కే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో సముద్ర సింహం సడెన్‌గా చిన్నారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కాగా, ఈ ఘటన జరిగినప్పుడు చిన్నారి తండ్రి పక్కనే ఉండి చోద్యం చూస్తూ నిలబడ్డాడు. వెంటనే అప్రమత్తమై చిన్నారిని లాగేయడంతో ప్రమాదం తప్పింది. ఇలా అజాగ్రత్తగా ఉండటం వల్లే సముద్ర సింహం.. చిన్నారిపై దాడి చేయబోయిందని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పిల్లల్ని చూసుకునేది ఇలాగేనా.. కొంచెం అయితే చిన్నారి ప్రమాదంలో పడేదంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

వైరల్ వీడియో..

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోను redditలో షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించి ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రమాదకరమైన జంతువులతో వీడియోలు చేయవద్దంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి