Viral Video: ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో నాగుపాము ఒకటి. అది కాటు వేసిందంటే నీరు కూడా అడగరు. అంతేకాదు పాములలో రాజు నాగుపాము. కానీ సైజు పరంగా చెప్పాలంటే పాముల జాతులలో కొండచిలువ అతిపెద్దది అత్యంత శక్తివంతమైనది. దీని కబంధ హస్తాల్లో చిక్కుకున్నారంటే బయటపడటం అసాధ్యం. అయితే ఈ రెండు శక్తివంతమైన పాములు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎవరు గెలిచారో తెలుసుకుందాం.
1 నిమిషం 25 సెకన్ల నిడివి గల ఈ వీడియోను వైరల్ ప్రెస్ తన యూట్యూబ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ పోరాటం సింగపూర్‌లోని బులో వెట్‌ల్యాండ్ రిజర్వ్‌లో జరిగింది. ఈ వీడియోలో కొండచిలువ, నాగుపాము ఒకదానికొకటి ఘర్షణ పడడాన్ని చూడవచ్చు. మనందరికీ తెలిసినట్లుగా నాగుపాము రాజు. రాజును ఓడించడం అంత ఈజీ కాదని ఇక్కడ నిరూపించాడు. ఒక చిన్న పోరాటంలో నాగుపాము కొండచిలువను అధిగమించింది. ఆ తర్వాత అతన్ని చంపి మింగేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బులోహ్ వెట్‌ల్యాండ్ రిజర్వ్ ఉద్యోగులు నాగుపాము, కొండచిలువకు మధ్య భీకర పోరాటాన్ని గుర్తించారు. అయితే కొంతసమయం వరకు కొండచిలువ ఆధిపత్యం చెలాయించింది. తర్వాత నాగుపాము దానిని ఓడించి మింగడం మొదలెట్టింది. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే దృశ్యం. ఎందుకంటే కొండచిలువ పేరు వినగానే ప్రజలు దాని శక్తిని ఊహించుకుంటారు. కానీ ఇక్కడ నాగుపాము కొండచిలువ కంటే కొంచెం పెద్దది. అది కొండచిలువను సులభంగా అధిగమించడం విశేషం. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను యాభై వేలకు పైగా వీక్షించారు.