chocolate dosa : హోటల్ ఫుడ్ అంటే ఎక్కువ మంది చాలా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే..హోటల్స్‌లో చేసే దోశలకు ఫ్యాన్స్ ఎక్కువగానే ఉంటారు. అయితే, ఈ దోశల్లో చాలా రకాలు ఉంటాయి. ఉప్మా దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ, చికెన్ దోశ ఇలా రకరకాలుగా ఉంటాయి.. వీటితోపాటు 70 ఎంఎం అనే భారీ దోశలు కూడా ఉంటాయి. కానీ ఇలాంటి దోశను ఎక్కడ చూసి ఉండరు. అయితే, ఇప్పుడు తాజాగా మరో స్వీట్ దోశ యాడ్ అయింది…ఇదే చాక్లెట్ దోశ… సాధారణ దోశల మాదిరిగానే తయారు చేసిన ఈ దోశలో చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేశారు. దోశ పూర్తిగా వండిన తర్వాత దానిపై చాక్లెట్ సిరప్‌తో మరింత అందంగా డిజైన్ చేశారు. పూర్తిగా కోన్ ఆకారంలో తయారైన ఈ చాక్లెట్ దోశ చూసేందుకు మాత్రం అట్రాక్టివ్‌గానే కనిపిస్తోంది.
అమర్ సిరోహి అనే ఫుడ్ బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాక్లెట్ దోశపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. కొందరు సూపర్బ్ అంటూ లైక్ చేస్తుంటే, మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ చాక్లెట్ దోశ మాత్రం చాలా మందిని ఊరిస్తోందనే చెప్పాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :