Viral Video: అరేయ్ ఎవర్రా మీరంతా.. ఎలా వస్తాయ్‌రా ఇలాంటి ఐడియాలు.. జుగాడ్ ఏసీకి నెటజన్స్ ఫిదా!
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదా.. జీవితాన్నేమోగాని అక్కడి ప్రజల కష్టాలు మాత్రం మార్చేసింది. జుగాడ్ సహాయంతో తమ పనిని ఎలా నిర్వహించాలో బాగా తెలిసిన ప్రజలు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఈ వ్యక్తులు, సాధారణ వస్తువులను ఉపయోగించి అద్భుతాలు సృష్టిస్తుంటారు. అలాంటి జుగాడ్...

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదా.. జీవితాన్నేమోగాని అక్కడి ప్రజల కష్టాలు మాత్రం మార్చేసింది. జుగాడ్ సహాయంతో తమ పనిని ఎలా నిర్వహించాలో బాగా తెలిసిన ప్రజలు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఈ వ్యక్తులు, సాధారణ వస్తువులను ఉపయోగించి అద్భుతాలు సృష్టిస్తుంటారు. అలాంటి జుగాడ్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఒక వ్యక్తి జుగాడ్ ఐడియాకు నెటిజన్స్ షాక్ అవుతున్నారు. సంతోషంగా జీవించాలంటే ధనవంతులై ఉండాల్సిన పని లేదని చిన్న చిన్న ఐడియాలో కూడా ఆనందంగా జీవించవచ్చని ఇది చాటి చెబుతుంది.
వైరల్ అవుతున్న ఈ వీడియో దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్ జిల్లాకు చెందినది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మండే వేడి ప్రజల పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. ఇక్కడ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, నీలిరంగు టాక్సీ డ్రైవర్ వేడి నుండి తప్పించుకోవడానికి ఓ జుగాడ్ ఆలోచనతో చేశాడు. వెంటనే ఓ పరికరాన్ని అమర్చాడు. ఇది చూసిన తర్వాత నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అతను తన వాహనాల్లో చేతితో తయారు చేసిన ఎయిర్ కూలర్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో, చాలా మంది కూలింగ్ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోగా మరొకొంత మంది ఎయిర్ కండిషనింగ్ యూనిట్లను ఇన్‌స్టాల్ చేసుకున్నారు.
వీడియోను చూడండి:
🇦🇫 VIDEO: Afghanistan taxi drivers turn to handmade coolers to beat the heat
As temperatures soar in southern Afghanistan, taxi drivers in Kandahar have taken to installing handmade cooling systems on their vehicles to beat the heat. pic.twitter.com/CevZEuFooV
— AFP News Agency (@AFP) July 10, 2025
ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటి ఆఫ్ఘనిస్తాన్. వాతావరణ మార్పుల ప్రభావం ఈ దేశంపై ఎక్కువగ ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఇక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావం చపుతుంది. ఈ క్రమంలో కారు చౌకగా లభించిఏ వస్తువులతో కారు డ్రైవర్లు ఇలా జుగాడ్ ఏసీలు సృష్టించారు. తమకే కాకుండా ప్రయాణికులకు సైతం చల్లదనాన్ని అందిస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
