AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: కంత్రీ పిల్లి.. యాక్టింగ్‌లో ‘ఆస్కార్’ ఇచ్చేయొచ్చు.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..!

Funny Video: ఈ భూమిపై కొన్ని కొట్ల జంతువులు మనుగడ సాగిస్తున్నాయి. వీటిలో కొన్నింటి గురించి మాత్రమే మానవ ప్రపంచానికి తెలుసు. మరీ ముఖ్యంగా మనుషులతో మమేకై జీవించే వాటిలో పిల్లి, కుక్క గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి..

Funny Video: కంత్రీ పిల్లి.. యాక్టింగ్‌లో ‘ఆస్కార్’ ఇచ్చేయొచ్చు.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..!
Cat
Shiva Prajapati
|

Updated on: Mar 31, 2022 | 6:00 PM

Share

Funny Video: ఈ భూమిపై కొన్ని కొట్ల జంతువులు మనుగడ సాగిస్తున్నాయి. వీటిలో కొన్నింటి గురించి మాత్రమే మానవ ప్రపంచానికి తెలుసు. మరీ ముఖ్యంగా మనుషులతో మమేకై జీవించే వాటిలో పిల్లి, కుక్క గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసి జీవిస్తాయి ఈ మూగ జీవాలు. చాలా మంది పెంపుడు జంతువులుగా పిల్లులు, కుక్కలను పెంచుకుంటారు. ఇంట్లో రెండూ ఉన్నట్లయితే.. అవి చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఒకదానితో ఒకటి గిల్లికజ్జాలు ఆడుతుంటాయి. అయితే, తాజాగా ఓ పిల్లికి అల్లరి చేష్టలకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగానే పిల్లులు చాలా కన్నింగ్ గా ఉంటాయి. మన దేశీ పిల్లులు అయితే, ఇళ్లలోకి చొరబడి గుట్టు చప్పుడు కాకుండా పాలు, పెరుగు తాగి వెళ్లిపోతుంటాయి. ఆ క్రమంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేరా? అనేది చాలా తెలివిగా పరిశీలిస్తాయి. ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత వచ్చిన పని పూర్తి చేసుకుని చటుక్కున అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఈ వైరల్ వీడియోలోని పిల్లి కూడా అచ్చం అలాంటి ప్రయత్నమే చేసింది. కాకపోతే.. దాని నటన మామూలుగా లేదు. వంట గదిలోకి దూరిన ఆ పిల్లి.. ముందుగా ఎవరైనా ఉన్నారా? అని చూసింది. తన రెండు కాళ్లపై నిల్చుని అటూ ఇటూ తెరిపారా పరిశీలించి చూసింది. ఎవరూ లేరని భావించిన ఆ పిల్లి.. తన పని తాను మొదలు పెట్టింది. అయితే, పిల్లి చేష్టలను వీడియో రికార్డ్ చేశారు ఇంటి యజమాని. ఆ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో rhmsuwaidi అనే ఐడీలో షేర్ చేశారు. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 6 సెకన్ల వ్యవధితో ఉన్న ఈ వీడియోను 5 వేలకు పైగా వ్యూ్స్ వచ్చాయి. వందలాది మంది లైక్స్ చేస్తున్నారు. ఫన్నీ క్యాట్‌కు ఫిదా అయిపోన యూజర్లు.. రకరకాల కామెంట్స్ చేస్తు్న్నారు.

Also read:

BJP vs TMC: ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులకు మీరేం చేశారు.. కేంద్రాన్ని నిలదీసిన మమతా బెనర్జీ!

Rajinikanth : సూపర్ స్టార్‌కు జోడీగా మరోసారి ఆ ప్రపంచ సుందరి.. ఏ సినిమాలో అంటే

srinidhi shetty: పూల ఋతువుల కోమలిలాగ ఫ్యాన్స్ మతి పోగొడుతున్న కేజీఎఫ్ ముద్దుగుమ్మ ‘శ్రీనిధి శెట్టి’..

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..