అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్‌లో అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో అడవుల్లో మంటలు చెలరేగాయి. దీని కారణంగా అనేక నివాస ప్రాంతాలు కూడా అగ్ని ప్రమాదం బారిన పడ్డాయి. కోట్ల విలువైన ఆస్తులు బూడిదయ్యాయి. ఈ మంటలు హాలీవుడ్ హిల్స్‌ను కూడా చుట్టుముట్టాయి. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ తారలు చాలా మంది తమ ఇళ్లను వదిలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ నేపధ్యంలో ఓ వీడియో బయటకు వచ్చింది. దీనిలో ఒక విలాసవంతమైన భవనం మంటలతో చుట్టుముట్టబడి కనిపిస్తుంది. ఈ భవనం విలువ సుమారు రూ.300 కోట్లుగా చెబుతున్నారు.
మీడియా నివేదికల ప్రకారం ఈ భవనం అమెరికాలోని ప్రధాన ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్‌గా తెలుస్తోంది. ఈ వీడియోను చూసిన ప్రజలు షాక్ తిన్నారు. ఎందుకంటే మంటలు మొత్తం భవనాన్ని చుట్టుముట్టడంతో.. కొద్దిసేపటికే భవనం కాలి బూడిదయ్యంది. ఈ దృశ్యం చూసిన తర్వాత ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదమా.. లేక ఎవరైనా అణుదాడి చేశారా అనిపిస్తోందని అంటున్నారు.
ఇక్కడ వీడియో చూడండి
వైరల్ అవుతున్న వీడియోలో మంటలు భవనం పూర్తిగా దగ్ధమైనట్లు చూడవచ్చు. మంటలు భవనం ఎత్తైన గోడలను దాటుకుంటూ లోపలి చేరుతున్నట్లు కనిపిస్తుంది. ఈ దృశ్యం లాస్ ఏంజెల్స్ అడవి మంటల భయానకతను హైలైట్ చేసిందని చెప్పవచ్చు. మీడియా కథనాల ప్రకారం మంగళవారంలో అగ్ని ప్రమాదం మొదలు కాగా..క్రమేపీ ఈ మంటలు మంటలు వ్యాపిస్తూ నగరంలోని అనేక ప్రాంతాలను చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.
ఈ వీడియోని ఇన్‌స్టాలో maddzak అనే ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటి వరకూ ఈ వీడియోను కోట్లాది మంది వీక్షించారు. రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు ‘ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యకరమైనది.. ఎవరూ ఊహించ లేనిది అని కామెంట్ చేయగా.. మరొకరు తన జీవితంలో మొదటిసారిగా ఇలాంటి అగ్నిప్రమాదం చూశాను అని రాశారు. ‘దీనిని కవర్ చేస్తే బీమా కంపెనీ కూడా దివాలా తీస్తుంది’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి