ఒకప్పుడు ధనవంతులు మాత్రమే ప్రయాణించే రవాణా సాధనం విమానం.. ఇప్పుడు మధ్య తరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు విమానం ప్రయత్నం చాలా సులువు. గత కొన్నేళ్ల క్రితం వరకూ ఆకాశంలో విమానం ఎగురుతుంటే.. దానిని చూడడానికి ఎగబడుతూ చిన్నారులు సందడి చేసేవారు. కొందరు ఎప్పటికైనా తమ జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలనీ కోరుకునేవారు. అలా ఆలోచించిన వారు ఇప్పుడు ఫ్లైట్‌లో తిరుగుతూ కనిపిస్తున్నారు కూడా.. అయితే, విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో కొంత మంది ప్రయాణీకులు వింత పనులు చేయడం చాలాసార్లు కనిపిస్తుంది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కరంగా మారతారు. ప్రస్తుతం అలాంటి కేసు ఒకటి వార్తల్లో నిలుస్తోంది. ఇది ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
వాస్తవానికి ఆకాశంలో విమానం ఎగురుతున్న వేళ.. విమానంలో కూర్చున్న ప్రయాణికులు తోటి ప్రయాణీకుడి చేతులు, కాళ్లు కట్టేసేంత ప్రమాదకరమైన పని చేశాడు. న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుంచి చికాగోకు వెళుతున్న ‘అమెరికన్ ఎయిర్‌లైన్స్’ విమానానికి సంబంధించిన కేసు. వివరాల్లోకి వెళ్తే..
ప్రయాణీకులు హాయిగా ప్రయాణిస్తున్నారు, ఫ్లైట్ ఆకాశంలో ఉంది మరియు ఇంతలో ఒక ప్రయాణికుడికి ఏమి జరిగిందో తెలియదు.. అతను హఠాత్తుగా నిల్చుని ఎగురుతున్న విమానం ఎమర్జెన్సీ గేట్‌ను తెరవడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో విమానంలోని ప్రయాణికులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారితో ఘర్షణకు దిగాడు. అటువంటి పరిస్థితిలో ప్రయాణికులు అతని చేతులు, కాళ్ళను డక్ట్ టేపుతో కట్టివేయవలసి వచ్చింది. దీంతో అప్పుడు అతను తాను చేయాలనుకున్న పనిని చేయలేకపోయాడు.
అల్బుకెర్కీ నుండి విమానం బయలుదేరిన 30 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి హఠాత్తుగా విమానం తలుపును దూకుడుగా తెరవడానికి ప్రయత్నించాడు. ఇది చూసిన తోటి ప్రయాణీకులకు మూర్ఛ వచ్చినంత పనైంది. ఇది చూసిన నేను మరో 5 మంది వ్యక్తులు కలిసి అతని ప్రయత్నాన్ని ఆపాలని చూశాం.. అత్యంత కష్టం మీద కుస్తీ పట్టి, అతని చేతులు, కాళ్లకు డక్ట్ టేప్ వేసి..బంధించాల్సి వచ్చిందని ఒక ప్రయాణీకుడు సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నాడు.
30 minutes after departing Albuquerque I was shaken out of my Panda Express and Tequila induced stupor by a man trying to aggressively open the airplane door 4 rows back. Me and 5 other dudes had to wrestle him into the aisle, duct tape his legs, and throw flexi-cuffs on him.… pic.twitter.com/zkrtEveYgQ
— The Wonton Don (@DonnieDoesWorld) February 20, 2024
More footage pic.twitter.com/lguvoybraY
— lol1v1meirl (@Rickeeslade) February 21, 2024
అనంతరం విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ వింత ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుడిని పట్టుకుని కట్టేయడానికి ప్రయాణికులు ఎలా ప్రయత్నిస్తున్నారో, నిందితుడు వారి నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు.
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం అల్బుకెర్కీ విమానాశ్రయం నుండి విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి విమానంలోని ఎమెర్జెన్సీ విండో దగ్గరకు చేరుకుని దాని హ్యాండిల్‌ను పట్టుకుని తెరవడానికి ప్రయత్నించడం ప్రారంభించాడు. సకాలంలో అతడి ప్రయత్నానికి తోటి ప్రయాణీకులు అడ్డు కట్టవేశారు. ఇలా ఆపడం అదృష్టమని లేకుంటే విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరి ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..