Viral Video: బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ ను తండ్రిని అనుకరిస్తూ పాడుతున్న చిన్నారి.. నీ ప్రతిభకు మేము ఫిదా అంటున్న నెటిజన్లు

|

Aug 24, 2022 | 5:06 PM

'కబీర్ సింగ్' సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్‌లు మళ్ళీ తెరపైకి వచ్చాయి. తాజాగా కబీర్ సింగ్ లోని ఒక సాంగ్ చిన్నారి పాడుతున్న సాంగ్ ఒకటి వైరల్ అవుతోంది.

Viral Video: బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ ను తండ్రిని అనుకరిస్తూ పాడుతున్న చిన్నారి.. నీ ప్రతిభకు మేము ఫిదా అంటున్న నెటిజన్లు
Little Girl Video Viral
Follow us on

Viral Video: షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘కబీర్ సింగ్’. ఈ సినిమా మాత్రమే కాదు.. ఇందులోని ప్రతి ఒక్క పాట హిట్. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రజల నోట కబీర్ సింగ్ సాంగ్స్ ..  పాటల ప్రేమికుల నోట వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్‌లు మళ్ళీ తెరపైకి వచ్చాయి. తాజాగా కబీర్ సింగ్ లోని ఒక సాంగ్ చిన్నారి పాడుతున్న సాంగ్ ఒకటి వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక తండ్రి.. అతని కుమార్తె గిటార్ వాయిస్తున్నారు. తండ్రి  ‘కబీర్ సింగ్’లోని సూపర్‌హిట్ పాట ‘కైసే హువా’ గిటార్‌పై ప్లే చేస్తూ పాడుతుంటే… తండ్రి ని అనుకరిస్తూ.. చిన్నారి కూడా కైసే హువా అంటూ స్వరం కలిసింది. చిన్నారి చూపిన అత్యుత్సాహం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ 35 సెకన్ల వీడియోలో, తండ్రి పాటను ప్రారంభించిన వెంటనే, ‘కైసే హువా’ అనే లైన్ వచ్చిన వెంటనే, అమ్మాయి తన శక్తిని అంతా గొంతులో తీసుకుని తండ్రిని అనుకరిస్తూ పాడటం మీరు చూడవచ్చు. ఆ అమ్మాయి ఉత్సాహం చూస్తుంటే.. కైసే  హువా అంటూ ఎంతో ఇష్టంగా పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మాయి హాట్ స్టైల్‌ చూపరుల మోముపై నవ్వులు పూజిస్తుంది. ఈ వీడియో తెగ షేర్ అవుతుంది.

ఈ ఫన్నీ వీడియో @blinking_hasi అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటి వరకూ 6 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది. చిన్నారి  క్యూట్‌నెస్ , సాంగ్ ను అనుసరిస్తున్న విధానం నన్ను అభిమానిని చేశాయి ఒకరు కామెంట్ చేస్తే.. ఈ సంవత్సరం నేను చూసిన అత్యుత్తమ విషయం ఇదే అని మరొకరు కామెంట్ చేశారు. చిన్నారి సాంగ్ పాడుతున్న శైలి నిజంగా నా హృదయాన్ని గెలుచుకుందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..