AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అబ్బ.. మంచి విందు భోజనం దొరికిందిరా.. కానీ అంతలోనే ఊహించని ట్విస్ట్‌..!

Viral Video: అడవి జంతువులు ఎల్లప్పుడూ ఆహారం కోసం వెతుకుతూనే ఉంటాయి. కనిపించిన చిన్న జంతువులపై దాడి చేసి కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకుంటాయి.

Viral Video: అబ్బ.. మంచి విందు భోజనం దొరికిందిరా.. కానీ అంతలోనే ఊహించని ట్విస్ట్‌..!
Leopard Deer Video
uppula Raju
|

Updated on: Mar 14, 2022 | 6:05 AM

Share

Viral Video: అడవి జంతువులు ఎల్లప్పుడూ ఆహారం కోసం వెతుకుతూనే ఉంటాయి. కనిపించిన చిన్న జంతువులపై దాడి చేసి కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అయితే జంతువులపై దాడి చేసేటప్పుడు వాటి ఎత్తుగడ మామూలుగా ఉండదు. ముఖ్యంగా సింహం, పులి వంటి క్రూర జంతువులు మాటువేసి మరీ పంజా విసురుతాయి. క్షణాల్లో పని పూర్తి చేస్తాయి. వేటకి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఎందుకంటే నెటిజన్లు జంతువులకి సంబంధించిన కంటెంట్‌ని ఎక్కువగా వీక్షిస్తారు. అందుకే ఈ వీడియోలు సోషల్‌మీడియాలో ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. తాజాగా చిరుత, జింకలకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. వీడియోలో ఒక జింక గడ్డి తింటూ ఉంటుంది. దాని పక్కనే ఉన్న చిరుత దానిని గమనించడం మనం వీడియోలో చూడవచ్చు. అయినా జింక దానిని చూసి భయపడలేదు. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నింలేదు. దీంతో చిరుతకి కోపం వచ్చి దానిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ కుదరలేదు.

ఎందుకంటే ఆ రెండింటి మధ్య ఒక కంచెం ఉండటం మనం వీడియోలో చూడవచ్చు. అందుకే జింక ధైర్యంగా తన పని తాను చేసుకుంటుంది. ఈ ఫన్నీ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వార్తలు రాసే సమయానికి ఈ వీడియోని 62 వేల మంది చూశారు. దీంతో పాటు సరదా కామెంట్లు కూడా చేశారు. మీరు కూడా ఈ వీడియోని చూస్తే మీ స్పందనని తెలపండి.

Sonia Gandhi: కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియానే.. సీడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయాలు..

CBSE: పదో తరగతి విద్యార్థులకి షాక్.. అవి రిజల్ట్‌ కాదు.. థియరీ మార్కులు మాత్రమే..

Russia Ukraine War: ఉక్రెయిన్‌ దాడుల్లో అమెరికన్‌ జర్నలిస్ట్‌ మృతి.. మరొకరి తీవ్ర గాయాలు..