Viral Video: తృటిలో కనుమరుగైన మృత్యువు.. లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లేవారికి ఇది వార్నింగే! వీడియో

|

Jul 08, 2024 | 1:19 PM

జర్నీ అంటే కొంత మందికి మహా ఇష్టం. సోలోగా లేదంటే ఇష్టమైన వ్యక్తితో అలా సుదూర తీరాలను లాంగ్‌ జర్నీలకు వెళ్లడం మనలో చాలా మందికి సరదా. అలా లాంగ్ జర్నీలకు వెళ్లే వారికి దడ పుట్టించే సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. చుట్టూ అడవి, కొండలు.. మధ్యలో నిర్మానుష్యమైన రోడ్డు. ప్రశాంతంగా డ్రైవింగ్‌ చేస్తూ వెళ్లున్న ఓ ద్విచక్ర వాహనదారుడికి షాకింగ్‌ సీన్‌ కనిపించింది. వెంటనే బైక్‌ను రోడ్డు మధ్యలో పార్క్‌ చేసి..

Viral Video: తృటిలో కనుమరుగైన మృత్యువు.. లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లేవారికి ఇది వార్నింగే! వీడియో
Leopard Sighting In Dive Ghat
Follow us on

జర్నీ అంటే కొంత మందికి మహా ఇష్టం. సోలోగా లేదంటే ఇష్టమైన వ్యక్తితో అలా సుదూర తీరాలను లాంగ్‌ జర్నీలకు వెళ్లడం మనలో చాలా మందికి సరదా. అలా లాంగ్ జర్నీలకు వెళ్లే వారికి దడ పుట్టించే సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. చుట్టూ అడవి, కొండలు.. మధ్యలో నిర్మానుష్యమైన రోడ్డు. ప్రశాంతంగా డ్రైవింగ్‌ చేస్తూ వెళ్లున్న ఓ ద్విచక్ర వాహనదారుడికి షాకింగ్‌ సీన్‌ కనిపించింది. వెంటనే బైక్‌ను రోడ్డు మధ్యలో పార్క్‌ చేసి.. ఒక్క క్షణం తన కళ్లను తానే నమ్మలేనంతగా ఆశ్చర్యంలో తలమునకలైపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌ చల్ చేస్తుంది. ఇంతకీ ఇతగాడు ఏం చూశాడో.. ఆ కథేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌లోని పూణే నివాసితులకు లాంగ్ డ్రైవ్‌లకు ప్రసిద్ధి చెందిన ఫేమస్‌ స్పాట్ ఒకటి ఉంది. అదే డైవ్ ఘాట్. ఇక్కడి ప్రశాంతమైన రోడ్డుపై తరచూ ప్రయాణికులు లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్తుంటారు. ఇటీవల కొందరు ప్రకృతి తన్మయత్వంలో మునిగి ప్రశాంతంగా తమ తమ వాహనాల్లో రోడ్డుపై అలా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తుండగా.. వారికి మెరుపుతీగలా ఓ సన్నివేశం క్షణాల్లో కనిపించి కనుమరుగై పోయింది. అదేనందీ సూసర్‌ ఫాస్ట్‌గా పరిగెత్తే చిరుతపులి. రోడ్డుకి ఆపక్క నుంచి చెట్ల పొందల్లో నుంచి ఒక్కసారిగా రోడ్డుపైగా పరుగున వచ్చి.. రోడ్డు దాటి మరుక్షణంలోనే ఇవతలి చెట్ల పొదల్లై కనుమరుగై పోయింది. రద్దీ రోడ్డుపై చిరుత ఏ వాహనాన్నైనా ఢీ కొని ఉంటే దాని ప్రాణంతో పాటు.. వాహనంపై ప్రయాణించేవారి వారిప్రాణం కూడా గాల్లో కలిసిపోయేవి.

ఇవి కూడా చదవండి

ఈ హఠాత్‌ పరిణామానికి ద్విచక్ర వాహనాల్లో వెళ్తున్న వారు షాక్‌కు గురయ్యారు. తృటిలో ఇద్దరు ద్విచక్రవాహనదారులను తప్పించుకుని చిరుత వేగంగా అటు వెళ్లింది. రెప్పపాటులో ప్రమాదం తప్పిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపైకి చిరుత పరుగెత్తిన వీడియో ఘటనను వెనుకే వస్తున్న ఓ కారులోని ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. అది కాస్తా వైరల్ అవుతోంది.

హడప్సర్ సమీపంలో ఉన్న డైవ్ ఘాట్ సాస్వాద్ వైపు వెళ్లే మార్గం ఇది. ఆదివారం (జులై 7) తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో నేపథ్యంలో అటుగా ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తులు చేస్తున్నారు. సెప్టెంబర్ 2023లో సరిగ్గా ఇదే ప్రదేశంలో ఓ చిరుతపులి కనిపించింది. ఇటీవల వీడియోతో అది కంటపడటంతో అటవీ శాఖ ఆ ప్రాంతంలో నిఘా పెట్టి, పెట్రోలింగ్‌ను నిర్వహిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.