ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాశంగా మారింది. సాధారణంగా చెప్పుల ధర ఎంత ఉంటుంది.? 200 నుంచి ఓ 500 వరకు ఉంటుంది. ఇక ధనవంతులు ధరించే చెప్పుల ఖరీదు వెయ్యి, రెండు,మూడు వేలు కూడా ఉండోచ్చు. కొంతమంది ఇంకా ఖరీదైనవి ధరింస్తారు. కానీ, కువైట్‌లోని ఒక దుకాణంలో వేలల్లో కాదు లక్షల్లో అమ్ముతున్నారు. ఆ చెప్పుల్ని చూస్తే మాత్రం మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చెప్పులు మన దేశం చాలా మంది ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు లేదా టాయిలెట్‌లో ఉపయోగించేటప్పుడు ధరించే స్లిప్పర్‌లతో సమానంగా ఉంటాయి.
ఒక వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ చెప్పుల అమ్మకానికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోలో చెప్పుల నాణ్యత, దాని ధరను ప్రస్తావించారు. అయితే మన దగ్గర సాధారణంగా కనిపించే ఈ చెప్పుల ధర విని భారతీయులు ఆశ్చర్యపోయారు. వీడియోలో కనిపించినట్టుగా ఈ చెప్పుల ధర 4500 Saudi Riyalsగా ప్రకటించారు. అంటే సుమారు రూ. 1 లక్ష రూపాయలకు సమానం. ఇంట్లో వాడే స్లిప్పర్స్ లా ఉండే ఈ చెప్పుల ధర లక్ష రూపాయలు అని వినగానే భారతీయ జనాలు దానిపై ఫన్నీగా చర్చించుకుంటున్నారు. నేను టాయిలెట్‌కి వెళ్లడానికి ఇలాంటి స్లీపర్స్‌ని మాత్రమే ఉపయోగిస్తానని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ చేశారు. ఈ చెప్పులు నేను 60 రూపాయలకే కొంటానని ఒకరు రాశారు.
ఈ స్లిప్పర్ గరిష్ట ధర 250 రూపాయలు అని చాలా మంది నెటిజన్లు రాశారు. ఇంతకంటే ఎక్కువ చెల్లించడం వ్యర్థం అంటున్నారు. ఈ స్లిప్పర్‌ను ఇండియా నుండి కువైట్‌కి ఎగుమతి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొకరు రాశారు. కేవలం 200 రూపాయలకే ఇక్కడ కొనుగోలు చేసుకుని అక్కడ 500-1000 రూపాయల వరకు అమ్ముకోవచ్చునని చెబుతున్నారు. ప్రపంచంలో ఎంత మోసం జరుగుతుందో దీన్ని బట్టి తెలుస్తుందని మరొకరు అంటున్నారు కేవలం రూ.100 లోపు విలువ చేసే చెప్పులు రూ.లక్షకు అమ్ముతున్నారని మరొకరు రాశారు.
ఈ వీడియో @kuwaitinside పేరు గల ఖాతా నుండి షేర్ చేయబడింది. ఇది కువైట్‌కు సంబంధించిన స్థానిక సమాచారాన్ని షేర్ చేస్తుంది. ఒక్క రోజులోనే ముప్పై లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. వేలాది మంది ప్రజలు కామెంట్ చేశారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..