చండీగఢ్‌లోని ఓ దాబా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో బబ్లూ అనే వ్యక్తి వాహనాల్లో ఉపయోగించే ఇంధనం, డీజిల్‌లో వేయించిన పరాఠాలను ప్రజలకు తినిపిస్తానని, వారు కూడా వాటిని ఎంతో ఇష్టంగా తింటారని పేర్కొన్నాడు. దీన్ని ఫుడ్ వ్లాగర్ షేర్ చేశారు వైరల్‌గా మారిన క్లిప్‌లో బబ్లూ ‘డీజిల్ పరాఠా’ను తానే చేశానని చెప్పడం వినిపించింది. ఇప్పుడు ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న నిజం కూడా వెలుగులోకి వచ్చింది. ఇది ఫేక్ అని కేవలం సరదా కోసమే చిత్రీకరించామని దాబా యజమాని చెబుతున్నాడు.
డీజిల్ పరాఠా విషయంపై క్లారిటీ ఇస్తూ ధాబా యజమాని చన్నీ సింగ్ కు సంబంధించిన మరో వీడియో బయటపడింది. చన్నీ సింగ్ ప్రముఖ వార్తా సంస్థ ANI తో మాట్లాడుతూ, డీజిల్ పరాటా లాంటిదేమీ లేదని చెప్పారు. డీజిల్‌లో తయారు చేసిన పరోటాను ఎవరైనా ఎలా తింటారు.. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.. మరి నేను ఎలా ఈ డీజిల్ పరాఠాను కస్టమర్స్ కు వడ్డిస్తాను.. ఎవరికీ వడ్డించమని చెప్పాడు.
డీజిల్ పరాఠా అనేది వినోదం కోసం మాత్రమే బ్లాగర్ చేత తయారు చేయబడిందని దాబా యజమాని తెలిపారు. వ్లాగర్ తన తప్పును గుర్తించి.. ఇప్పుడు క్షమాపణ కూడా చెప్పాడని అతను చెప్పాడు.
#WATCH | In a viral video, a man in a Chandigarh dhaba was seen claiming that the oil he uses to make parathas is diesel. Owner of the dhaba refutes such claims.
Channi Singh, owner of the dhaba says, “We neither make any such thing as ‘diesel paratha’ nor serve any such thing… pic.twitter.com/15BJ7lMSR3
— ANI (@ANI) May 15, 2024
ధాబా యజమాని డీజిల్‌లో వండిన ఆహారం వైరల్ అయింది. అయితే అతను తాను ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే అందిస్తానని హామీ ఇచ్చాడు. మేము ఎవరి జీవితాలతో ఆడుకోం అని అన్నారు. దాబాలో ఎడిబుల్ ఆయిల్ మాత్రమే ఉపయోగిస్తామని స్పష్టం చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఆ వీడియోను చూడండి.
సంచలనం సృష్టించిన డీజిల్ పరాటా ఆ వీడియో
What’s next??
Harpic ParanthaWhen ICMR recommends you to avoid whey protein and FSSAI don’t care about the Ethylene oxide level in the masala…what can we say. No wonder India is the cancer capital of the world. pic.twitter.com/O3aeqlJUAR
— The Cancer Doctor (@DoctorHussain96) May 12, 2024
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..