నేటికాలంలో మొబైల్ క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చీరాగానే వారికి కావాల్సింది మొబైల్. భోజనం చేసేటప్పుడు కూడా మొబైల్ ఫోన్లు కావాలి. ఫోన్ మాయలో పడి ఆడుకోవడానికి కూడా వీళ్లు ఇష్టపడటం లేదు. మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూస్తూ వాటికి అతుక్కుపోతున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పిల్లల్లో ఫోన్ అడిక్షన్ ఎలా తప్పించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇందుకు ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లోని హెచ్‌పీ ఇంటర్నేషనల్ స్కూల్ టీచర్లు ఓ పరిష్కారాన్ని కనిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
బదౌన్‌లోని హెచ్‌పీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువతున్న పిల్లల ముందు అక్కడి టీచర్లు ఓ స్కిట్ ప్రదర్శించారు. ఈ స్కిట్ చూసిన పిల్లలు మొబైల్ ఫోన్లంటే చాలా భయపడిపోయారు. మొబైల్ ఫోన్లు వాడమని ఏక బిగువున చెబుతున్నారు. టీచర్లు చేతికి ఫోన్లు ఇస్తున్నా ‘మాకొద్దంటూ..’ ఏడుపు లంకించుకుంటున్నారు. HP ఇంటర్నేషనల్ స్కూల్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు మూడు కోట్ల వీక్షణలు, లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. అసలింతకీ ఈ వీడియోలో ఏముందంటే.. HP ఇంటర్నేషనల్ స్కూల్ సుమారు 10 సంవత్సరాల క్రితం బదౌన్‌లో ప్రారంభమైంది. ఈ పాఠశాలలో ప్రతీయేట వందలాది పిల్లలు చదువుతున్నారు. అయితే ఇక్కడి పిల్లలు సరిగ్గా చదువడం లేదనీ, ఇంటికి వెళ్ళగానే తమ మొబైల్ ఫోన్‌లను అడుగుతున్నారని, నిద్రపోయే వరకు మొబైల్ ఫోన్‌లతోనే బిజీగా ఉంటున్నారని, వారికి చదువులు, క్రీడలపై ఆసక్తి ఉండటం లేదని తల్లిదండ్రులు టీచర్లకు ఫిర్యాదు చేస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ శివమ్ పటేల్‌కు ఇలా నిత్యం ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పిల్లల్లో మొబైల్ అడిక్షన్ తొలగించడానికి టీచర్లందరితో మాట్లాడి.. పిల్లలందరి ముందు టీచర్లు ఓ డ్రామా ప్లే చేశారు.
बच्चों से मोबाइल की लत छुड़वानी है तो ये दिखा दें ये वीडियो..!
यूपी के बदायूं के HP इंटरनेशनल स्कूल की टीचर्स ने बच्चों को मोबाइल से दूर करने के लिए एक अवेयरनेस प्लान बनाया है। वीडियो में एक टीचर आंखो पर पट्टी बांधकर रोती नज़र आती है। टीचर के पूछने पर कहती है कि ज्यादा मोबाइल… pic.twitter.com/4XrNZXWR2a
— Vikash Mohta (@VikashMohta_IND) September 11, 2024
స్కూల్ ప్లేగ్రౌండ్‌లో పెద్ద సంఖ్యలో చిన్న పిల్లలు ఉండటం ఈ వీడియోలో చూడవచ్చు. ఇంతలో ఒక మేడమ్ కళ్ళ మీద కర్చీఫ్‌తో చెయ్యి వేసుకుని, మరో కంటికి బ్యాండేజ్ వేసుకుని ఏడుస్తూ వస్తుంది. మితగా టీచర్లంతా ఏమైంది?అని అదుర్ధాగా అడుగడం వీడియోలో కనిపిస్తుంది. ఫోన్‌ని ఎక్కువగా చూడటం వల్లే ఇలా జరిగిందని ఏడుస్తున్న టీచర్ అందరికీ వినిపించేలా చెప్పింది. అది విన్న ఓ టీచర్ అక్కడ ఉన్న పిల్లలతో.. ‘మేడమ్‌ని చూడండి.. కంటి నుంచి ఎంత రక్తం ఎలా వస్తోందో చూడండి. ఫోన్ చూస్తే మీ కంటి నుంచి కూడా ఇలాగే రక్తం వస్తుందని’ చెప్పడంతో అక్కడున్న పిల్లలంతా భయంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత ఓ టీచర్ పిల్లల వద్దకు వెళ్లి ఫోన్‌ని తీసుకోమని ఇచ్చినా.. వారు తీసుకోవడానికి నిరాకరించడం వీడియోలో చూడొచ్చు. మీ ఇంట్లో పిల్లలు కూడా మొబైల్ ఫోన్లను వదులుకుంటే ఈ వీడియో చూపించండంటూ ఆ స్కూల్ టీచర్లు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.