Viral Video: పులుల మధ్య.. హాయిగా తిరుగుతున్న కుక్క.. అరుదైన వీడియోకి నెటిజన్లు ఫిదా..
Viral Video: పులులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే వైరల్ అవుతున్న వీడియోలో పులుల మధ్య ఓ కుక్క కనిపిస్తుంది.
అడవికి రారాజు సింహం. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జంతువు సింహం.. దీని తర్వాత కౄర జంతువు ఏదైనా ఉంటే అది పులి. అడవి జంతువుల ప్రాణాలను మాత్రమే కాదు.. మానవుల ప్రాణాలను సైతం తీసే అత్యంత ప్రాణాంతక జంతువులు సింహం, పులి. జంతుప్రదర్శనశాలల్లో పులులు, సింహాలను చూసి ఉంటారు. ఈ ప్రమాదకరమైన జింక పులిని చూస్తే జింక నుంచి అడవి గేదె వరకు ఏ జంతువులైనా సరే పారిపోవాల్సిందే. అయితే తాజాగా పులులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే వైరల్ అవుతున్న వీడియోలో పులుల మధ్య ఓ కుక్క కనిపిస్తుంది. చాలా పులుల మధ్య హాయిగా తిరుగుతున్న కుక్క.. చూసి అందరూ షాక్ తింటున్నారు. రోజు సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నప్పటికీ, ఈ వీడియో భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి దృశ్యాలు సాధారణంగా కనిపించవు.
పులుల మధ్య కుక్క నిర్భయంగా ఎలా నిలబడిందో వీడియోలో చూడొచ్చు. కుక్క ఏదో తన కుటుంబ సభ్యుల మధ్య ఉన్నట్లు ఫీల్ అవుతుంది. ఒకసారి రెండు పులులు ఒకదానితో ఒకటి కాసేపు ఢీకొన్నప్పటికీ కుక్కకి ఏ మాత్రం హాని చేయలేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన దృశ్యం. సాధారణంగా.. పులులు కుక్కను చూస్తే.. దానిని వెంటాడి.. వేటాడి ఊపిరాడకుండా చేసి తినేస్తాయి. అయితే ఈ వీడియోలో దృశ్యం అందుకు ఖచ్చితమైన వ్యతిరేకం. పులుల మందలో ఉన్న కుక్కని అసలు అవి పట్టించుకోలేదు.. తమ కుటుంబంలో ఓ సభ్యురాలిగా చూస్తున్నాయి.
View this post on Instagram
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో టైగర్__బిగ్‌ఫాన్ పేరుతో షేర్ చేయబడింది. ఇప్పటివరకు 1 మిలియన్ సార్లు వీక్షించబడింది. 44 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ఆ కుక్క ఆ పులులతో కలిసి పెరిగిందేమో’ అని ఒకరు కామెంట్ చేస్తే.. కుక్క కూడా పులినే అని పులులు భావిస్తున్నాయని మరో యూజర్ సరదాగా కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..