AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ముంబైలో అంతే..ముంబైలో అంతే… కప్పు ఛాయ్‌ రేటు చూసి దుబాయోడి దిమ్మ తిరిగిందట…

ఒక్క కప్పు ఛాయ్‌ వెయ్యి రూపాయాలా? ఇండియాలో నేను పేదవాడిలా ఫీల్ అయ్యా అంటూ ఓ ఎన్నారై ఇండియాలో పెరిగిన జీవన వ్యయంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. దర్హామ్‌లలో సంపాదించే తాను కూడా ఇండియా పర్యటనలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డానని చెప్పడం అందరినీ...

Viral Video: ముంబైలో అంతే..ముంబైలో అంతే... కప్పు ఛాయ్‌ రేటు చూసి దుబాయోడి దిమ్మ తిరిగిందట...
Nri Shocke Tea Rs1000 In In
K Sammaiah
|

Updated on: Aug 21, 2025 | 6:52 PM

Share

ఒక్క కప్పు ఛాయ్‌ వెయ్యి రూపాయాలా? ఇండియాలో నేను పేదవాడిలా ఫీల్ అయ్యా అంటూ ఓ ఎన్నారై ఇండియాలో పెరిగిన జీవన వ్యయంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. దర్హామ్‌లలో సంపాదించే తాను కూడా ఇండియా పర్యటనలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డానని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతని కామెంట్‌పై నెట్టింట చర్చ మొదలైంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. దుబాయ్‌లో నివసించే ట్రావెల్ వ్లాగర్ పరిక్షిత్ బలోచి భారత్‌లోని ప్రధాన నగరాల్లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వీడియో ద్వారా తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇప్పటివరకు ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియోలో ఆయనేమన్నారంటే.. ముంబైలోని ఒక హోటల్‌లో ఒక కప్పు టీ తాగాననీ అందుకోసం వెయ్యి రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని వాపోయారు. భారత్‌లో తిరుగుతుంటే తను ఓ పేదవాడిలా ఫీల్‌ అయ్యాననీ, ఇలా జరుగుతుందని తనెప్పుడూ ఊహించలేదనీ తెలిపారు.

సాధారణంగా, విదేశాల్లో సంపాదించే ఎన్నారైలకు కరెన్సీ మారకం వల్ల భారతదేశంలో ఖర్చులు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని బలోచి అన్నారు. దర్హామ్‌లను రూపాయలుగా మార్చిన తర్వాత కూడా తనకు షాక్ తగిలిందనీ గతంలో ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేదని వీడియోలో చెప్పుకొచ్చారు.

వీడియో చూడండి:

పరీక్షిత్ బలోచి అభిప్రాయంతో ఏకీభవిస్తూ నెట్టింట యూజర్లు తమ అనుభవాలను పంచుకుంటూ, ముంబై వంటి నగరాల్లో ఖర్చు ఎంత విపరీతంగాపెరిగిందో కామెంట్ల రూపంలో తెలియచేస్తున్నారు.

Follow Us
పెళ్లి సినిమాతో కెరీర్ మారిపోయింది.. అప్పుడు రెమ్యునరేషన్ ఎంతంటే.
పెళ్లి సినిమాతో కెరీర్ మారిపోయింది.. అప్పుడు రెమ్యునరేషన్ ఎంతంటే.
ఇంట్లోనే హోటల్ స్టైల్ క్రిస్పీ మినప వడ,లోపల దూదిలా మెత్తగా రావాలా
ఇంట్లోనే హోటల్ స్టైల్ క్రిస్పీ మినప వడ,లోపల దూదిలా మెత్తగా రావాలా
CBSE కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల్లో మూడో భాష తప్పనిసరి..
CBSE కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల్లో మూడో భాష తప్పనిసరి..
మిక్సీ సరిగ్గా పనిచేయడం లేదా.. నయా పైసా ఖర్చు లేకుండా బ్లేడ్లను..
మిక్సీ సరిగ్గా పనిచేయడం లేదా.. నయా పైసా ఖర్చు లేకుండా బ్లేడ్లను..
విధి నిర్వహణలో ఉండగా ఘోర ప్రమాదం..!
విధి నిర్వహణలో ఉండగా ఘోర ప్రమాదం..!
భోజనానికి ముందు ఇవి తీసుకుంటే గుండెకు 100 రెట్లు పుష్టి..
భోజనానికి ముందు ఇవి తీసుకుంటే గుండెకు 100 రెట్లు పుష్టి..
వర్షాల కోసం వింత మొక్కులు.. కప్పల్లా బండ పాయాసం నాకిన గ్రామస్తులు
వర్షాల కోసం వింత మొక్కులు.. కప్పల్లా బండ పాయాసం నాకిన గ్రామస్తులు
రెండు నెలల్లో వెండి ధర ఎంత తగ్గిందో తెలిస్తే అవాక్కవుతారు!
రెండు నెలల్లో వెండి ధర ఎంత తగ్గిందో తెలిస్తే అవాక్కవుతారు!
హాస్టల్ మెస్‌లలో నాన్‌వెజ్ బ్యాన్.. ఎందుకంటే?
హాస్టల్ మెస్‌లలో నాన్‌వెజ్ బ్యాన్.. ఎందుకంటే?
వర్షాకాలంలో ఏసీ నుంచి వాటర్ లీక్.. ఇలా చేస్తే నిమిషాల్లోనే..
వర్షాకాలంలో ఏసీ నుంచి వాటర్ లీక్.. ఇలా చేస్తే నిమిషాల్లోనే..