ఢిల్లీ మెట్రోలో మందుబాబులు హల్‌చల్.. వీడియో తీసి నేరుగా DMRCకి ట్యాగ్ చేసిన ప్రయాణికుడు.. తర్వాత ఏమైందంటే..

|

May 23, 2023 | 9:09 PM

ఢిల్లీ మెట్రో మరోమారు వార్తల్లోకెక్కింది. ఈ సారి ఢిల్లీ మెట్రోలో మందుబాబులు హల్‌చల్‌ చేశారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మందుబాబుల వీరంగాన్ని తోటి ప్రయాణికులు తమ సెల్‌ఫోన్ల ద్వారా రికార్డ్‌ చేశారు. మత్తులో ప్రయాణిస్తున్న మందుబాబుల వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

ఢిల్లీ మెట్రోలో మందుబాబులు హల్‌చల్.. వీడియో తీసి నేరుగా DMRCకి ట్యాగ్ చేసిన ప్రయాణికుడు.. తర్వాత ఏమైందంటే..
Delhi Metro
Follow us on

ఢిల్లీ మెట్రోలో చాలా మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే మెట్రో ప్రయాణం చాలా పొదుపుగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే దీన్ని ఢిల్లీ లైఫ్ లైన్ అంటారు. అలాంటి ఢిల్లీ మెట్రోలో గత కొంతకాలంగా ఆకతాయిలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. చిత్ర విచిత్ర చేష్టలతో తోటి ప్రయాణికులకు చిరాకు పుట్టిస్తున్నారు. కొందరు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు కూడా వెలుగులోకి రావటంతో ఢిల్లీ మెట్రో అధికారులు స్పందించారు. అలాంటి వెకిలీ చెష్టలు చేస్తున్న వారిపట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ మెట్రో మరో సంఘటన ప్రయాణికుల్ని కలవరపెడుతోంది.

ఢిల్లీ మెట్రో మరోమారు వార్తల్లోకెక్కింది. ఈ సారి ఢిల్లీ మెట్రోలో మందుబాబులు హల్‌చల్‌ చేశారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మందుబాబుల వీరంగాన్ని తోటి ప్రయాణికులు తమ సెల్‌ఫోన్ల ద్వారా రికార్డ్‌ చేశారు. మత్తులో ప్రయాణిస్తున్న మందుబాబుల వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దాంతో మరోమారు ఢిల్లీ మెట్రో వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. వీళ్లేప్పుడు మారతర్రా బాబు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. వైరల్‌ వీడియో ఓపెనింగ్‌లోనే రైలు కోచ్ లోపల కింద కూర్చున్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు వీడియో చూపిస్తుంది. వీడియోపై DMRCని ట్యాగ్ చేస్తూ, ప్రయాణీకుడు అనురాగ్ దూబే ఇలా అడిగాడు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ మెట్రో ప్రయాణీకుడు ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఢిల్లీ మెట్రో రైలు కోచ్ లోపల నేలపై కూర్చున్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు వీడియో చూపిస్తుంది. వీడియోపై DMRCని ట్యాగ్ చేస్తూ, ప్రయాణీకుడు అనురాగ్ దూబే ఇలా అడిగాడు: ఈ రకమైన తాగుబోతులను మెట్రోలో ఎలా అనుమతిస్తారంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన డీఎంఆర్‌సీ ఘటన జరిగిన కోచ్ నంబర్‌ను తెలుసుకోవాలని కోరింది. పటేల్ నగర్, రాజేంద్ర ప్యాలెస్ స్టేషన్ల మధ్య ఉన్న మెట్రో బ్లూ లైన్‌లో ఈ వీడియోను రికార్డు చేశానని బదులిచ్చారు. మందుబాబులు కరోల్ బాగ్ వద్ద మెట్రో దిగారు. మీరు మీ cctv (sic)ని చెక్‌ చేసుకోవచ్చునని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..