కుక్కలను కొంతమంది సొంత కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకుంటారు. వాటికీ పుట్టిన రోజు, పెళ్లి, సీమంతం వేడుకలను కూడా జరుపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వైభవంగా జరిగిన కుక్కల పెళ్లి వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అంగరంగ వైభవంగా సాగుతున్న వివాహ వేడుకలో రంగురంగుల దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్న అతిథులు బంతిపూలు పట్టుకుని నిల్చుకుని ఉన్నారు. వాద్యాల నడుమ కుక్కల పెళ్లి ఇంత వైభవంగా జరిగింది. అవును.. రెండు కుక్కల యజమానులు తమ కుక్కలకు ఘనంగా పెళ్లి జరిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీరు చాలా వివాహ వేడుకలకు హాజరై ఉంటారు. అయితే ఇంత గొప్ప వేడుకను, ముఖ్యంగా కుక్కల పెళ్లిని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఇటీవల, మీరు సోషల్ మీడియాలో కుక్కల పెళ్లి గురించి చాలా వార్తలు చూశారు. అయితే ఈ వీడియో చాలా డిఫరెంట్‌గా, ప్రత్యేకంగా ఉంది. కుక్కల గ్రాండ్ వెడ్డింగ్ వీడియోను ఇక్కడ చూడండి.
They Had An Indian Wedding For Their Dogs.
😭😭😭😭
Deo Aapne Vichaar… pic.twitter.com/BsxMpi1nmE
— ਹਤਿੰਦਰ ਸਿੰਘ (@Hatindersinghr3) March 8, 2023
వీడియోలో భారతీయ సంప్రదాయం ప్రకారం విలాసవంతమైన పెళ్లి వేదిక, రకరకాల వంటలతో విందు, ఆకట్టుకునే అలంకరణలతో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అతిథులు సంప్రదాయ దుస్తులలో నృత్యం చేస్తున్నారు. పెండ్లికుమార్తెలా రెడీ చేసిన ఆడ కుక్కపై ఎర్రటి దుపట్టా కప్పబడి ఉంటుంది. అలాగే ఓ మగ కుక్క ఎలక్ట్రిక్ బొమ్మ కారులో పెళ్లి మండపంలోకి ప్రవేశిస్తోంది. ఈ వీడియోను @Hatindersinghr3 అనే వినియోగదారు ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేసారు. మార్చి 8న షేర్ చేసిన ఈ వీడియోకు 17,000 మందికి పైగా వీక్షణలు వచ్చాయి. రకరకాల కామెంట్స్ చేస్తూ నెటిజన్లు సందడి చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..