సోషల్ మీడియాకు తనదైన ఆకర్షణ ఉంది. ఇక్కడ ఎవరు ఎప్పుడు వైరల్ ఎవరికీ అవుతారో తెలియదు. ఎందుకంటే ఈ ప్రపంచం చాలా ప్రత్యేకమైనది. విభిన్నమైనది. ప్రస్తుతం ఓ చిన్నారికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీ చిన్ననాటి సాకులు గుర్తుకు వస్తాయి. చిన్నతనంలో చదువుకునే సమయంలో చెప్పే సాకులు, పని చేయమంటే చెప్పే సాకులు ఇవన్నీ కనుల ముందుకు తెస్తుంది ఈ వీడియో.
ప్రతి తల్లితండ్రులు తమ పిల్లలు బాగా చదవాలని, రాయాలని, చదివి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే పిల్లల మనసు ఎక్కడ ఎక్కువ చదువు కంటే.. ఇతర వ్యాపకాల మీద దృష్టి ఉంటుంది. చిన్నతనంలో పిల్లల మనసు చదువు మీద కంటే.. ఎక్కువగా ఆడుకోవడం, గెంతడం లాంటి వాటిపైనే నిమగ్నమై ఉంటుంది. అయితే తల్లిదండ్రులు చదువుకోమని ఛేబ్బితే పిల్లలు బలవంతంగా చదువుకోవడానికి కూర్చోవాల్సి వస్తుంది. ఇక తమ తల్లిదండ్రులు స్వయంగా చదువు చెప్పడానికి హోమ్ వర్క్ చేయించడానికి కూర్చుంటే ఆ ఇబ్బంది మరింత పెరుగుతుంది. అప్పుడు పిల్లల తమకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలు కావడం లేదన్నట్లు ఫీల్ అవుతారు. చదువుల కోమని అన్నారని ఓ బాలుడు ఏడవడం ఈ వీడియోలో చూడవచ్చు. అప్పుడు కూడా తన కుమారుడిని తల్లి సముదయిస్తుంది. తల్లీకొడుకుల సంభాషణ వింటే మీ నవ్వును అదుపు చేసుకోలేరు.
వైరల్ అవుతున్న వీడియోలో.. పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు.. అతని తల్లి ఈ వీడియో తీస్తున్నట్లు మీరు చూడవచ్చు. దాని వల్ల ఆ బాలుడికి కోపం వచ్చింది. రీల్ పై చదువుకోమని అంటే.. వెంటనే చదువు ఎగ్గొట్టడానికి ఏదొక సాకు దొరుకుతుంది అనే కామెంట్ తో మొదలవుతుంది. ఓ బాలుడు ఏడుస్తూ.. కోపంగా తన తల్లితో… ‘నేను అలసిపోయాను.. మీకు సెలవులుంటాయి.. అని ఏడుస్తూ తన పరిస్థితిపై కంప్లైయింట్ చేస్తున్నాడు. అప్పుడు తల్లి ‘నాకు ఎవరి ప్రేమ ఉంది…?’ అని కొడుకుతో అంటే.. మళ్ళీ ఆ బాలుడు.. లిల్ అని చెప్పాడు. తల్లి ‘లిల్లెస్‌కి ఏమైంది? మీ బ్లాగింగ్ అని చెప్పడంతో.. నేను ఎక్కడ బ్లాగ్ లో ఉన్నానని అడిగింది. చివరికి వీడియో తీయొద్దని కొడుకు అంటే.. సరే నేను వీడియో షూట్ చెయ్యను.. రా నాదగ్గరికి అని చెప్పడంతో కొడుకు తల్లిదగ్గరకు వచ్చి చిరునవ్వులు చిందించాడు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిఫుల్‌లైఫ్అడ్డు అనే ఖాతాలో షేర్ చేశారు. 23 వేల పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ‘నిజంగా ఈ పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు’ ఒకరు కామెంట్ చేస్తే.. మరికొందరు యూజర్లు తల్లి పిల్లాడిని వీడియో తీయడంపై విమర్శలు గుప్పించారు. ఆ ‘అబ్బాయి రీల్స్ గురించి సరిగ్గా చెప్పాడని వ్యాఖ్యానించారు.