Viral Video: ఐకమత్యం అంటే ఇదే.. ఆహారం కోసం పక్షిని పట్టుకున్న పిల్లి పై పక్షుల దాడి.. వీడియో వైరల్

|

Sep 09, 2022 | 5:15 PM

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లో షేర్ చేయబడిన వీడియో ప్రస్తుతం ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఒక పిల్లి.. ఆహారంగా ఒక పక్షిని ఎగిరి అందుకుంది.. అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్.. పిల్లి ఇలా చేయగానే... వెంటనే పిల్లిపై అనేక పక్షులు దాడి చేశాయి.  

Viral Video: ఐకమత్యం అంటే ఇదే.. ఆహారం కోసం పక్షిని పట్టుకున్న పిల్లి పై పక్షుల దాడి.. వీడియో వైరల్
Viral Video
Follow us on

Viral Video: కుక్క, పిల్లి వంటి జంతువులను పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇవి చేసే పనులు కూడా అందరిని అలరిస్తూ ఉంటాయి. ఏ జంతువులైనా సరే తమ ఆహారం కోసం వేట కొనసాగిస్తూనే ఉంటాయి. అది ప్రకృతి ధర్మం. ఇక తమకు నచ్చిన ఆహారం కోసం కుక్క, పిల్లి వంటివి పడే పాట్లు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని సార్లు వాటి విన్యాసాలు అయ్యో అనిపిస్తాయి. తాజాగా ఓ పిల్లి తన ఆహారం కోసం చేసిన వేటకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.  ఇంటర్నెట్‌లో పిల్లులు వాటి అద్భుతమైన విన్యాస నైపుణ్యాలను ఉపయోగించి గాలిలో వాటిని పట్టుకోవడం ద్వారా పక్షిని వేటాడడాన్ని చూపించే అనేక వీడియోలు ఉన్నాయి. అయితే  ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో తమని వేటాడుతున్న పిల్లిపై పక్షులు ప్రతీకారం తీర్చుకోవడం.. పిల్లిపై దాడి చేస్తోన్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

బుధవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో షేర్ చేయబడిన వీడియో ప్రస్తుతం ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఒక పిల్లి.. ఆహారంగా ఒక పక్షిని ఎగిరి అందుకుంది.. అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్.. పిల్లి ఇలా చేయగానే… వెంటనే పిల్లిపై అనేక పక్షులు దాడి చేశాయి.

ఇవి కూడా చదవండి

గాలిలో ఎగురుతున్న పక్షిని పట్టుకోవడానికి పిల్లి గాలిలోకి ఎగరడంతో వీడియో ప్రారంభమవుతుంది. పిల్లి  పక్షిని పట్టుకుని నేలపైకి వచ్చినప్పుడు..  పక్షి విడిపించుకోవడానికి పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అకస్మాత్తుగా.. పక్షి స్నేహితులు పిల్లిపై దాడి చేయడం ప్రారంభించాయి. పక్షిని విడిచిపెట్టమని  ఒక్కసారిగా పిల్లిపై విరుచుకుపడ్డాయి. వాటితో పోరాడిన పిల్లి.. ఓడిపోయి.. పక్షిని వదిలి.. వెంటనే అక్కడ నుంచి పారిపోయింది.

ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. “ఇంకా జాతుల మధ్య యుద్ధం లాంటిది. రెండు వేర్వేరు పక్షులు కావాలని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..