AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: విధి రాత అంటే ఇదే.. సెకన్ల వ్యవధిలో ఘోర ప్రమాదం.. షాకింగ్ వీడియో..!

Viral Video: ఒకసారి ఇంటి నుంచి బయటకు వచ్చాక.. తిరిగి ఇంటికి వెళ్తామా? లేదా? అనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఏ ఉపద్రవం ఎటునుంచి పొంచి

Viral Video: విధి రాత అంటే ఇదే.. సెకన్ల వ్యవధిలో ఘోర ప్రమాదం.. షాకింగ్ వీడియో..!
Fire Accident
Shiva Prajapati
|

Updated on: Apr 15, 2022 | 6:20 AM

Share

Viral Video: ఒకసారి ఇంటి నుంచి బయటకు వచ్చాక.. తిరిగి ఇంటికి వెళ్తామా? లేదా? అనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఏ ఉపద్రవం ఎటునుంచి పొంచి ఉంటుందో ఊహించలేం. మనం సక్రమంగా ఉన్నప్పటికీ.. అవతలివైపు నుంచి సరిగా ఉంటుందని భావించలేం. ఇందుకు నిదర్శనమైన ఘటనలు మనం నిత్యం ఎన్నో చూస్తుంటాం. కొంతకాలం క్రితం మన భాగ్యనగరంలోని పంజాగుట్టలో ఫ్లైఓవర్ పై కారు ప్రమాదం జరిగిన విషయం విధితమే. ఫ్లై ఓవర్‌పై వెళ్తున్న కారు.. మరో కారుమీద పడటంతో అందులోని వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అంటే ఒకరు చేసిన తప్పు కారణంగా.. మరొకరు బలైపోయారు. అదే విధిరాత అంటారు. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేం. తాజాగా ఇలాంటి భయాకన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. సెకన్ల వ్యవధిలోనే ఓ ట్రక్కు కాలి బూడిద అయిపోయింది. ట్రక్కు సరైన దారిలోనే వెళ్తున్నప్పటికీ.. ఓ కారు వచ్చి ఢీకొనడంతో ఆ భీకర ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకెళితే.. యుఎస్‌లోని బ్లెయిన్ సమీపంలోని హైవేపై ట్రక్కు వస్తోంది. ఇంతలో మరో దారి నుంచి దూసుకొచ్చింది కారు. స్పీడ్ అధికంగా ఉండటంతో డ్రైవర్ దానిని కంట్రోల్ చేయలేకపోయాడు. ఆ క్రమంలో హైవేపై వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది కారు. దాంతో ట్రక్కు కూడా ప్రమాదానికి గురైంది. ఫ్లై ఓవర్ పై ఉన్న సైడ్ వాల్‌ను ఢీకొట్టింది. దాంతో వెంటనే ట్రక్కు ఇంజన్‌కు మంటలు అంటుకున్నాయి. సెకన్ల వ్యవధిలోనే ట్రక్కు మొత్తం కాలిపోయింది. రోడ్డు మొత్తం నల్లటి పొగతో కమ్ముకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అక్కడి అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ట్రక్కుకు అంటుకున్న మంటలను అదుపు చేశారు. దాదాపు 2 గంటలపాటు శ్రమించి రోడ్డుపై నుంచి ఆ ట్రక్కును తరలించారు. కాగా, ఈ ప్రమాదం జరిగిన తీరు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also read:

IPL 2022: మెరిసిన హార్దిక్ పాండ్యా.. 37 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్‌ గెలుపు..

RK Roja: కన్నీటితో జబర్దస్త్‌కు గుడ్‌ బై చెప్పిన ఆర్కే రోజా.. ప్రజాసేవ కోసం తప్పడం లేదంటూ..

Charanjit Singh Channi: పంజాబ్‌ మాజీ సీఎం చన్నీకి ఈడీ ఝలక్‌.. ఇసుక మైనింగ్‌ కేసులో సుదీర్ఘ విచారణ..