Viral Video: వావ్.. క్యా సీన్‌హై.. మూగజీవులకు తెలుసు ప్రాణం విలువ… రేసులో పడిపోయిన వ్యక్తి ప్రాణాన్ని ఎలా కాపాడాయో చూడండి
ఎద్దుల రేసుకు సంబంధించిన హార్ట్ టచింగ్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని సెకన్ల ఈ వీడియోలో రేసు సమయంలో ట్రాక్‌పై పడిపోయిన వ్యక్తి ప్రాణాన్ని రెండు జతల ఎద్దులు ఎలా కాపాడాయో చూడటం అతి ముఖ్యమైనది. ఈ వీడియోను...

ఎద్దుల రేసుకు సంబంధించిన హార్ట్ టచింగ్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని సెకన్ల ఈ వీడియోలో రేసు సమయంలో ట్రాక్‌పై పడిపోయిన వ్యక్తి ప్రాణాన్ని రెండు జతల ఎద్దులు ఎలా కాపాడాయో చూడటం అతి ముఖ్యమైనది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దానిపై వివిధ రకాల ప్రతి స్పందనలు పోస్టు చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియో ఒక ఎద్దుల రేసు పోటీకి సంబంధించినది. దీనిలో రెండు గుర్రాలు, రెండు జతల ఎద్దులు రేసింగ్ ట్రాక్‌పై పరిగెడుతున్నట్లు మీరు చూడవచ్చు. ఈ సమయంలో గుర్రంపై స్వారీ చేస్తున్న యువకుడు అకస్మాత్తుగా అదుపుతప్పి ట్రాక్‌పై పడిపోతాడు.
దీన్ని చూసినప్పుడు ఆ వ్యక్తి వెనకాల వచ్చే ఎద్దుల కాళ్ళ కింద నలిగిపోతాడని మీరు భావిస్తారు, కానీ ఆ తర్వాత క్షణంలో అక్కడ జరిగిన సన్నివేశం లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది. వీడియోలో ఆ వ్యక్తిని ఎద్దులు తొక్కే బదులు ఒక ఎద్దు అతనిపైకి దూకిందని మీరు చూస్తారు. అతని వెనుక ఉన్న ఎద్దు కూడా అదే చేసి ఆ వ్యక్తిని గాయపరచకుండా ముందుకు సాగిపోతాయి.
వీడియో చూడండి:
View this post on Instagram
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేయడంతో త్వరగా వైరల్ అయింది. జంతువులు కూడా విజయం కంటే ప్రాణానికి ఎక్కువ విలువ ఇస్తాయని వినియోగదారు క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్లు దానిపై స్పందిస్తున్నారు. మనుషులే అయితే తొక్కుంటూ వెళ్లిపోయేవారు అని రాస్తున్నారు. అవి జంతవులు కదా మనుషుల కంటే ఎక్కువగా మానవత్వం ఉంటుందని మరికొందరు రాశారు. ఇది మానవత్వం కాదు, దీనిని సున్నితత్వం అంటారు. మానవత్వం మానవుల నుండి వస్తుంది, జంతువుల నుండి కాదు. అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
