Viral Video: ఓర్నాయనో..తిన్నది అరగకుంటే పాములు ఇలా కూడా చేస్తాయా?… కింగ్ కోబ్రా వెరైటీ పనికి నెటిజన్స్ షాక్
పాములకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి అని చెబుతారు. అది ఎవరినైనా కరిస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అందుకే కింగ్ కోబ్రాను తలచుకుంటేనే ఓ పక్క వణిపోతారు...

పాములకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి అని చెబుతారు. అది ఎవరినైనా కరిస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అందుకే కింగ్ కోబ్రాను తలచుకుంటేనే ఓ పక్క వణిపోతారు జనం. ప్రస్తుతం కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియలో పాము చేసిన పనికి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో ఎరను మింగిన తర్వాత కింగ్ కోబ్రా వింతగా ప్రవర్తిస్తుంది.
సాధారణంగా పాములు కప్పలు వంటి జీవులను మింగిన తర్వాత ఎక్కువసేపు విశ్రాంతి తీసుకుంటాయి. కానీ ఈ వీడియోలోని దృశ్యం వేరేలా ఉంది. ఈ వీడియోలో కింగ్ కోబ్రా తన తలను నిటారుగా ఉంచి నిలబడి తన దవడను వింతగా కదిలించడం మీరు చూడవచ్చు. ఈ పాము ఇలా ఎందుకు చేస్తుందో వీడియో చూస్తున్న వారికి కూడా అర్థం కాలేదు. అయితే, ఈ కింగ్ కోబ్రా తన ఎరను మింగిందని, ఆ తర్వాత దానిని జీర్ణం చేసుకోవడానికి తన దవడను అలా కదిలిస్తుందని చెబుతున్నారు. కొన్ని సెకన్ల పాటు ఈ వింత చర్య చేసిన తర్వాత పాము శాంతిస్తుంది.
వీడియో చూడండి:
King Cobra realigning its jaw after swallowing prey pic.twitter.com/8tp1UFeuzD
— Damn Nature You Scary (@AmazingSights) September 9, 2025
ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేశారు. కేవలం 10 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు, వందలాది మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఫన్నీ కామెంట్స్ పెడుతుతున్నారు.
