Viral Video: ఇదిగో శివంగి.. రోడ్డుపైనే బెల్టుతో ఆకతాయి తోలు తీసింది..
స్కూల్ యూనిఫాం ధరించిన ఓ బాలిక రోడ్డు మధ్యలో ఓ యువకుడిని కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. కొద్ది రోజులుగా యువకుడు బాలికను లైగింకంగా వేధిస్తున్నట్లు సమాచారం. దీంతో సహనం నశించి.. బాలిక ఆ ఆకతాయికి తగిన బుద్ది చెప్పింది.
స్కూల్ యూనిఫాం ధరించిన ఓ బాలిక రోడ్డుపై ఓ యువకుడిని తీవ్రంగా కొట్టి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో, యువతి యువకుడిని బెల్ట్‌తో కొట్టడం చూడవచ్చు. కొద్ది రోజులుగా యువకుడు లైగింక వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీంతో ఆ విద్యార్థిని ఓపిక నశించింది. యువకుడిని నడిరోడ్డుపై తోలు తీసిందివ. ఈ ఘటన అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. ఈ వీడియోను @gharkekalesh అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా , వీడియో వైరల్ అవుతోంది. ఆగస్టు 15న షేర్ చేసిన వీడియోకు ఒక్కరోజులోనే 2.2 మిలియన్లు అంటే 20 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:
Female students confronted the harasser and beat him up with belts on Road in Ahmedabad pic.twitter.com/pRoAH0Oi3w
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 15, 2024
ఈ వీడియోలో, ఒక యువకుడు రోడ్డు మధ్యలో పడుకుని ఉండగా, స్కూల్ యూనిఫాంలో ఉన్న ఒక అమ్మాయి అతనిని బెల్ట్‌తో కొట్టగా, మరొక అమ్మాయి అతని నీచపు పనుల్ని అక్కడ గుమికూడిన వారికి చెప్పడం చూడవచ్చ8ు . ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘లైంగిక వేధింపులకు పాల్పడేవారిని నడిరోడ్డుపై ఇంతకంటే దారుణమైన శిక్షలు వేయాలి’ అని ఓ నెటిజన్ కామెంట్‌లో రాశారు. ‘శివంగిని చూస్తున్నట్లు ఉంది. నీలాంటి ధీర వనితలే తల్లీ మన దేశానికి కావాల్సింది’ అని మరొకరు వ్యాఖ్యానించారు. “భరించడం, బాధ పడటమే కాదు.. అమ్మాయిలకు ఎదురుతిరగడం కూడా తెల్సు” అని మరొక మహిళ కామెంట్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..