Viral Video: లక్ష్యం ఒకటే.. కానీ మూడు మార్గాల్లో సాధించిన శునకాలు.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..
Dogs Viral Video: అత్యంత శక్తివంతమైన జంతువులలో కుక్కలు ఒకటి. వీటిని విశ్వాసానికి ప్రతిరూపంగా భావిస్తారు. శునకాలు ధైర్యసహాసాలను చూపించడానికి
Dogs Viral Video: అత్యంత శక్తివంతమైన జంతువులలో కుక్కలు ఒకటి. వీటిని విశ్వాసానికి ప్రతిరూపంగా భావిస్తారు. శునకాలు ధైర్యసహాసాలను చూపించడానికి ఎప్పుడూ భయపడవు. కొన్ని కుక్కలు కఠిన శిక్షణను కూడా పొందుతాయి. అవి అత్యంత ప్రమాదకరమైన విన్యాసాలను కూడా సులభంగా చేయగలవు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తాజాగా ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. పచ్చని పొలాల మధ్య మూడు కుక్కలు పరిగెడుతుంటాయి. ఈ సమయంలో మూడు కుక్కలు ఓ కాల్వను దాటుతాయి. కాల్వను జంప్ చేయడానికి శునకాలు మూడు మార్గాలను అనుసరిస్తాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాల్వ దాటి అవతలి వైపునకు వెళ్లడానికి మూడు కుక్కలు మూడు మార్గాల్లో వెళ్తాయి. ఈ మూడు కూడా కాల్వను దాటేందుకు ప్రయత్నిస్తాయి.. కానీ అవి తమదైన రీతిలో దాటేందుకు ట్రిక్‌ను అవలంభిస్తాయి. ఇది నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
ముందు కాల్వ దాటిన కుక్క.. నేరుగా లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఎలాంటి అవాంతరం లేకుండా కాల్వ అవతలి వైపునకు సాఫీగా దూకుతుంది. మరొక కుక్క కాల్వ మధ్యలో దూకి.. ఆ తర్వా అవతలి వైపునకు చేరుకుంటుంది. మూడవ కుక్క లక్ష్యాన్ని చేరుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అయితే.. దాని జంప్ కాస్త విఫలమవుతుంది. కాల్వ చివరివరకు వెళ్తుంది.. కానీ ఒడ్డుకు తగిలి గాయపడుతుంది. దాని లక్ష్యం విఫలమైనా.. మళ్లీ ముందుకు సాగుతుంది.
వైరల్ వీడియో..
ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మూడు కుక్కలు కూడా లక్ష్యాన్ని అధిగమించేందుకు పలు మార్గాలను పాటించాయని.. ఈ విషయాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటూ పేర్కొంటున్నారు. ప్రయత్నం ప్రతిదీ.. అనుభవాన్ని నేర్పుతుందని.. అంతే ఈ కుక్కలు చాలా మందికి మార్గనిర్దేశం చేస్తున్నాయంటూ పేర్కొంటున్నారు.
Also Read: