AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రీల్స్ పేరుతో పిచ్చి వేషాలు.. లైకులేమోగాని ప్రాణాలు పోతాయ్ .. సజ్జనార్‌ స్ట్రాంగ్ వార్నింగ్

Video Viral: సోషల్ మీడియాకి బానిసలుగా మారిన పిల్లలకు కౌన్సిలింగ్ అనేది అత్యవసరమని, ఈ వ్యసనం వల్ల జరిగే అనర్థాలను స్పష్టంగా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా రీల్స్ చేసే వారిని అరెస్ట్ చేయాలని రైల్వే శాఖకు నెటిజన్లు కోరుతున్నారు..

Viral Video: రీల్స్ పేరుతో పిచ్చి వేషాలు.. లైకులేమోగాని ప్రాణాలు పోతాయ్ .. సజ్జనార్‌ స్ట్రాంగ్ వార్నింగ్
Subhash Goud
|

Updated on: Jul 07, 2025 | 12:41 PM

Share

కొందరికి పిచ్చి ముదిరి రకరకాల రీల్స్‌ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. పైగా సోషల్‌ మీడియా వేదిగా వైరల్‌ చేస్తూ ఫేమస్‌ కావాలని కోరుకుంటారు. అలాంటి వారికి నెటిజన్ల తీవ్ర స్థాయిలో మండిపడుతుంటారు. ఇటీవల ఒడిషాలో కొంత మంది మైనర్ యువకులు రన్నింగ్ ట్రైన్ ముందు ప్రమాదకరంగా రీల్స్ చేశారు. ట్రైన్ వచ్చే సమయంలో ఓ బాలుడు రైల్వే పట్టాల మధ్యలో స్లీపర్ల మధ్య పడుకున్నాడు. మరో ఇద్దరు అతన్ని వీడియో తీస్తున్నారు. అప్పుడు రైలు పట్టాల మీద పడుకున్న వ్యక్తి నుంచి రైల్ స్పీడ్‌గా వెళ్లిపోయింది. ఇక రైలు వెళ్లిపోగానే ఏదో ప్రపంచ కప్‌ సాధించినట్లు అందరు గట్టిగా అరుస్తూ కేకలు వేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియావేదిగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. దీనికి సంబంధించి పోస్ట్ చేస్తూ.. తల్లిదండ్రులకు కీలక సూచనలు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Viral Video: ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను నిమిషాల్లోనే పట్టేసిన మహిళా ఆఫీసర్.. చూస్తేనే జడుసుకుంటారు

ఇవి కూడా చదవండి

చిన్నతనం నుంచే రీల్స్ పిచ్చి అనే మానసిక రోగానికి పిల్లలు ఇలా తయారు కావడకం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా మత్తులో పడి యువత చెడిపోతున్నారని వ్యాఖ్యానించారు. సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడడం లేదని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గాడిలో పెట్టినప్పుడు బాగుపడతారని అన్నారు. ప్రస్తుతం ఈ సోషల్‌ మీడియా ట్రెండింగ్‌ వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వీడియోలు చేయకుండా ఉండాలని సజ్జనార్‌ వార్నింగ్‌ ఇచ్చారు. చివరికి ఈ వీడియో పోలీసులకు వరకు వెళ్లింది. ఇంకేముంది స్పందించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారిపై పోలీసులు ఎఫ్‌ఆర్‌ నమోదు చేశారు.

సోషల్ మీడియాకి బానిసలుగా మారిన పిల్లలకు కౌన్సిలింగ్ అనేది అత్యవసరమని, ఈ వ్యసనం వల్ల జరిగే అనర్థాలను స్పష్టంగా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా రీల్స్ చేసే వారిని అరెస్ట్ చేయాలని రైల్వే శాఖకు నెటిజన్లు కోరుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి