Viral Video: ఫోన్ మాట్లాడుతున్న మహిళను ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చి అటాక్ చేసిన నక్క.. ఆ తర్వాత
ఆ మహిళ తన ఇంటి బయట రోడ్డు వద్ద నిల్చుని బిజీగా ఫోన్ మాట్లాడుతుంది. ఇంతలోనే ఓ నక్క పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెపై వెనక నుంచి ఒక్కసారిగా దాడి చేసింది.
Trending Video: ప్రజంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఓ వీడియోను మీ ముందుకు తీసుకువచ్చాం. అమెరికాలో ఓ మహిళ తన ఇంటి ముందు నిల్చుని ఫోన్ మాట్లాడుతుంది. ఈ లోపులో ఓ నక్క వెనకనుంచి ఒక్కసారిగా ఆమెపై అటాక్ చేసింది. షాక్‌కు గురైన సదరు మహిళ దాన్ని బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. కానీ విదిలిచ్చే కొద్దీ ఆ నక్క ఇంకాస్త అగ్రెసీవ్‌గా ఆమెపై దాడి చేయడం ప్రారంభించింది. దీంతో ఆ మహిళ కూడా దాన్ని నిలువరించేందుకు దాన్ని తన్నడం ప్రారంభించింది. తంతే కొంత దూరం పోయి పడ్డాక.. కూడా అది తిరిగి మళ్లీ అలానే దూసుకువస్తుంది. అలా ఆ మహిళను చాలా చోట్ల గాయపరిచింది. దాదాపు 40 సెకన్ల పాటు ఈ ఫైట్ జరిగింది. చివరికి ఆ పొరిగింట్లో నివాసం ఉండే వ్యక్తి.. ఓ కర్ర పట్టుకుని పరిగెత్తుకుని రావడంతో ఆ నక్క అక్కడి నుంచి పరారయ్యింది. సీసీ కెమెరాలో నక్క దాడి చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ దృశ్యాలు వైరలయ్యాయి.
#funniesttweets FOX Attacks Woman & Gets Punished!!! ???pic.twitter.com/hq48w8Kbxa
— Tyco Tv (@TycoDaGoat) August 25, 2022