Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: గ్రామంలో 2 పెంపుడు కుక్కలు మిస్సింగ్.. ఎంత వెతికినా దొరకలేదు.. కట్ చేస్తే..

గ్రామంలో 2 పెట్ డాగ్స్ మిస్సయ్యాయి. ఎంత వెతికినా వాటి ఆచూకి దొరకలేదు. చుట్టు పక్కల పొలాల్లో వెతికినా జాడలేదు. ఈ క్రమంలోనే ఓ ఊహించని సీన్ కనిపించింది.

Viral: గ్రామంలో 2 పెంపుడు కుక్కలు మిస్సింగ్.. ఎంత వెతికినా దొరకలేదు.. కట్ చేస్తే..
Python
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 18, 2022 | 10:12 AM

Trending: మాములుగా పెట్ డాగ్స్ ఎప్పుడూ యజమానిని అంటి పెట్టుకునే ఉంటాయి. ఒకవేళ యజమాని ఇంట్లో లేకపోతే అతను వచ్చేవరకు అలా ఎదురుచూస్తేనే ఉంటాయి. అలాంటిది ఓ వ్యక్తికి చెందిన 2 పెంపుడు కుక్కలు అదృశ్యం అయ్యాయి. గంటలపాటు వెతికినా వాటి ఆచూకి కనిపించలేదు. దీంతో ఆ ఓనర్ ఆందోళన చెందాడు. ఈ క్రమంలోనే గ్రామంలోనే ఓ మరుగు ప్రాంతంలో పాత కాంక్రీట్ స్తంభాలపై పాకుతూ భారీ కొండచిలువ ఓ వ్యక్తికి  కనిపించింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పాడు. అందరూ వచ్చి చెక్ చేయగా.. ఆ పైథాన్ అస్సలు కదల్లేకపోతుంది. పొట్ట భారీగా ఉబ్బి ఉంది. అప్పుడు అర్థం అయ్యింది.. ఆ కొండచిలువ పెట్ డాగ్స్‌ను ఆహారంగా తీసుకుందని. దీంతో ఆ ఓనర్ తల్లిడిల్లిపోయాడు. ఈ ఘటన ఈశాన్య థాయ్‌లాండ్‌(north eastern Thailand)లోని సిసాకేట్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఇది ఇప్పటివరకు తాము చూసిన పాములలో అతి పెద్దదని ఒక స్థానికుడు తెలిపాడు. కొండచిలువ ఆ బంజరు భూమిలో మాటు వేసి.. కొంతకాలంగా గ్రామంలోని జంతువులను మింగేస్తుందని అతను అభిప్రాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో యానిమల్ రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని.. దాన్ని బంధించి పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రపంచంలోనే అతి పొడవైన పాముగా పరిగణించబడే రెటిక్యులేటెడ్ పైథాన్‌తో సహా అనేక పైథాన్ జాతులు థాయ్‌లాండ్‌లో నివసిస్తున్నాయి. 2021లో కూడా చోన్ బురి ప్రావిన్స్‌లోని ఒక రైతు 20 అడుగుల పొడవున్న భారీ కొండచిలువను చూశాడు. ఆ భారీ పామును బంధించేందుకు దాదాపు 8 మంది రంగంలోకి దిగాల్సి వచ్చింది.

(Source)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించింది చూసి..
విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించింది చూసి..
చాట్జీపీటీతో జర భద్రం..ఏఐలతో మనసు విప్పితే బతుకు బస్టాండే
చాట్జీపీటీతో జర భద్రం..ఏఐలతో మనసు విప్పితే బతుకు బస్టాండే
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌