మారుతున్న కాలంతో పాటే మనిషి జీవన విధానంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. కాలంతో పోటీ పడుతూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. మారిన జీవన విధానంలో తినే తిండిలో, నిద్ర పోయే సమయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అంతేకాదు శారీరక శ్రమ తగ్గడంతో తరచుగా రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిరు తిండ్లకు, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటుకి పడిన ప్రజలు ఊబకాయం బారిన పడుతున్నారు. అనంతరం బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ముఖ్యంగా బాన వంటి పొట్టను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు.
ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వును, వేలాడే పొట్టను కరిగించుకోవడానికి నానా అగచాట్లు పడతాడు. పొట్టను కరిగించుకోవడానికి యోగా, సరైన ఆహారం దివ్యౌషధం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్నీ నేటి తరం కూడా అంగీకరిస్తుంది. అందుకే చాలా మంది తమ ఉదయాన్ని యోగా, జాగింగ్ వంటి వాటితో రోజుని ప్రారంభిస్తున్నారు. అయితే కొందరు తాము యోగా చేస్తున్నామని.. కానీ ఎటువంటి ఫలితం ఇవ్వడం లేదని.. బరువు తగ్గడం లేదని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయంపై కొత్త చర్య జరుగుతోంది.
‘ది లివర్ డాక్’గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ మనిషి తినే ఆహారం, వ్యాయామం, యోగాకు సంబంధించిన కొన్ని సాధారణ అపోహలను తీర్చే ప్రయత్నం చేశారు. దీంతో మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో కోలాహలం మొదలైంది.
అయితే కొంతమంది డాక్టర్ ఫిలిప్స్ సూచనలను విభేదిస్తున్నారు. బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించే 20 వాస్తవాలను పేర్కొంటూ ట్వీట్ చేశారు. వీటిల్లో బరువు తగ్గడానికి గ్రీన్ టీ తీసుకోవడం నుండి ఆరోగ్యకరమైన జుట్టు కోసం బయోటిన్ మాత్రలు తీసుకోవడం వరకు అన్నింటి గురించి తనదైన అభిప్రాయాలను వెల్లడించారు.
To summarize:
1. One whole egg with yolk a day does not increase blood cholesterol
2. Green tea does not help you lose weight
3. Jaggery, honey or sugarcane are not healthier than white sugar
4. There is no “healthy alcohol”
5. Ashwagandha does not reduce stress or help you…
— TheLiverDoc (@theliverdr) June 25, 2023
డాక్టర్ ఫిలిప్స్ చేసిన పోస్టుకు ఇప్పటివరకు 16 లక్షలకు పైగా వ్యూస్ రాగా, వందలాది మంది తమ అభిప్రాయాన్నివెల్లడిస్తున్నారు. అంతేకాదు ఈ ట్విట్ ను ఓ రేంజ్ లో రీట్వీట్ చేస్తున్నారు. యోగా గురించి డాక్టర్ ఫిలిప్స్ వెల్లడించిన అభిప్రాయాన్ని వ్యతిరేకించడం మొదలు పెట్టారు. వ్యాయామం లేదా మార్నింగ్ వాక్ ఆరోగ్యకరమైన జీవన శైలికి ఉపయోగం అని చెబుతున్నారు.
Since this is blowing up:
Post script:
#8: Yoga and weight loss:
A 2016 meta-analysis, the highest quality of evidence showed that benefits were inconclusive because studies suffered high risk bias and methodology design flawed. https://t.co/SANoMwGR3qA recent study showed…
— TheLiverDoc (@theliverdr) June 25, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..