AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ప్రపంచంలో ముస్లింలు లేని దేశం అదే..

ప్రపంచంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, బౌద్ధ, జైనులు ఇలా అనేక రకాల మతాలు ఉన్నాయి. ఈ మతాల్లో కొన్ని మతాలను అనుసరించే వారు ప్రపంచ జనాభాలో అధిక శాతం ఉన్నారు. ప్రపంచంలో రెండవ అతి పెద్ద మతం ముస్లిం. భారత దేశంలో మాత్రమే కాదు దాదాపు ప్రతి దేశంలో ముస్లింలు ఉన్నారు. అయితే భూమి మీద ముస్లింలు నివసించని ఏకైక ప్రదేశం ఉందని మీకు తెలుసా..

Viral News: ప్రపంచంలో ముస్లింలు లేని దేశం అదే..
Zero Muslim Population City
Surya Kala
|

Updated on: Sep 16, 2025 | 1:20 PM

Share

భారతదేశం లౌకిక దేశం. ఇక్కడ హిందువులు, ఇస్లాం, క్రైస్తవ మతం, సిక్కు మతం వంటి అనేక మతాలను అనుసరించే ప్రజలు నివసిస్తున్నారు. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం తరచుగా కనిపిస్తూనే ఉంటుంది. ఇస్లాం మతం ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఆచరించే మతాలలో ఒకటి, దాదాపు ప్రతి దేశంలో ముస్లింలు ఉన్నారు. భారతదేశంతో పాటు.. అనేక దేశాలలో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ముస్లిం మతం రెండవ స్థానం ఉంది. అయితే ప్రపంచంలో ఒక్క ముస్లిం కూడా లేని దేశం ఒకటి ఉంది. అది ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ నగరం.

ముస్లిం జనాభా లేని ఏకైక ప్రదేశం

ముస్లింలు అధిక సంఖ్యలో నివసించే దేశానికి వస్తే.. ఇండోనేషియా ప్రధమ స్థానంలో నిలుస్తుంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో ముస్లింలు నివసిస్తున్నారు. ఈ దేశంలో ముస్లిం జనాభాతో పాటు విబిన్న జాతులు నివశిస్తూ గొప్ప గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగి ఉంది. 231 మిలియన్లకు పైగా ఇస్లాం మతస్థులు ఈ దేశంలో నివసితున్నారు. ఇక వరసగా పాకిస్తాన్, భారత దేశం నిలిచాయి. పాక్ లో 210 మిలియన్లకు పైగా ముస్లింలు ఉండగా.. మన దేశంలో 200 మిలియన్లకు పైగా ముస్లింలు ఉన్నారు.

భారత దేశం ప్రజాస్వామ్యం దేశంగా ఉండగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు వంటి అనేక దేశాలు అధికారికంగా ఇస్లామిక్ దేశాలు. క్రైస్తవులకు అత్యంత పవిత్ర స్థలం వాటికన్ సిటీలో . ముస్లిం జనాభా లేదు.

ఇవి కూడా చదవండి

వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం.. వాటికన్ సిటీతో పాటు.. ప్రపంచంలో ముస్లిం జనాభా లేని 47 దేశాలు ఉన్నాయి. టోకెలావ్, నియు, ఫాక్లాండ్ దీవులు, కుక్ దీవులు, గ్రీన్లాండ్, సోలమన్ దీవులు, మొనాకో లతో పాటు అనేక నగరాల్లో ముస్లిం జనాభా లేదు. ఇక కాథలిక్ ను అనుసరించేవారికి సాంస్కృతిక కేంద్రంగా నిలిచినా వాటికన్ సిటీలో క్రైస్తవ ప్రపంచ గురువు పోప్ నివాసం ఉంటుంది. ఈ నగరం క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన నగరం. ఎలా అంటే.. ముస్లింలకు మక్కా పవిత్ర నగరం ఎలాగో అలాగే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..