Pet Lizard: పెంపుడు బల్లికి కోపం వచ్చింది.. కాటు వేసి యజమాని ప్రాణాలు తీసింది.. ఎక్కడంటే

|

Feb 24, 2024 | 11:43 AM

USAలోని కొలరాడో సిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ నివసిస్తున్న వ్యక్తికి రెండు పెంపుడు బల్లులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి గిలా మాన్‌ స్టర్ అనే బల్లి. ఈ బల్లికి ఒక రోజు ఏదో సమస్య వచ్చినట్లు ఉంది.. దీంతో తన యజమానిపై కోపం తెచ్చుకుంది. ఏకంగా కాటు వేసి యజమాని ప్రాణాలు తీసింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Pet Lizard: పెంపుడు బల్లికి కోపం వచ్చింది.. కాటు వేసి యజమాని ప్రాణాలు తీసింది.. ఎక్కడంటే
Colorado Man Dies After Gila Monster Bite
Image Credit source: David Clode on Unsplash
Follow us on

ప్రతి వ్యక్తికీ కొన్ని అభిరుచులు ఉంటాయి. కొన్నిసార్లు వ్యక్తుల అభిరుచి ప్రజలను ప్రేరేపించేలా ఉంటే..  కొన్నిసార్లు ఈ అభిరుచి ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం కాలంలో జంతువుల పట్ల ప్రజలకు ప్రేమ చాలా పెరిగిందని మనందరికీ తెలుసు. కొందరు కుక్క, పిల్లి, కుందేలు వంటి అనేక రకాల జంతువులను పెంచుకుంటారు. అయితే ఒక వ్యక్తి భిన్నమైన అభిరుచి ఉంది. ఆ అభిరుచి ఇష్టం అతని జీవితానికి శత్రువుగా మారింది.

USAలోని కొలరాడో సిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ నివసిస్తున్న వ్యక్తికి రెండు పెంపుడు బల్లులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి గిలా మాన్‌ స్టర్ అనే బల్లి. ఈ బల్లికి ఒక రోజు ఏదో సమస్య వచ్చినట్లు ఉంది.. దీంతో తన యజమానిపై కోపం తెచ్చుకుంది. ఏకంగా కాటు వేసి యజమాని ప్రాణాలు తీసింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ మొత్తం విషయం ఏమిటంటే

బిబిసి నివేదిక ప్రకారం ఈ దారుణ సంఘటన ఫిబ్రవరి 12వ తేదీన జరిగింది..  చికిత్స పొందుతూ ఫిబ్రవరి 16న ఆ బల్లి యజమాని మరణించాడని చెబుతున్నారు. నిపుణులు ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గిలా మాన్‌ స్టర్ బల్లుల కాటు సాధారణంగా ప్రాణాంతకం కాదని చెప్పారు. సాధారణంగా ఇవి కరిస్తే అక్కడ వాపు వస్తుంది. తీవ్రమైన రక్తస్రావం కలిగిస్తుంది. అరుదైన సందర్భంలో అలెర్జీ కలిగితే కనుక బల్లి కాటుకి గురైన వ్యక్తి మరణించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం వ్యక్తిని కాటు వేసిన బల్లిని ల్యాబ్‌కు తరలించారు. అక్కడ దీని విషాన్ని వెలికితీసి అధ్యయనం చేయనున్నారు. దీని కాటుకు యజమాని ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు.  కొలరాడోలో, గిలా మాన్‌ స్టర్, టరాన్టులా వంటి జంతువులను లైసెన్స్ లేకుండా ఇంట్లో పెంచుకోవడం  చట్టవిరుద్దం. ఇలాంటి చట్టాలను లెక్క చేయకుండా మృతుడు హాబీలో భాగంగా రెండు బల్లులను రహస్యంగా పెంచుకున్నాడని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..