Viral News: డిజిటల్ యుగంలో డ్రమ్మర్ సూపర్బ్ తెలివి.. క్యూఆర్‌ కోడ్ ఓపెన్ చేసి గిఫ్ట్ ఇవ్వమంటూ..

డోలు, సన్నాయి, డ్రమ్స్ వాయించే వాయిద్య కళాకారుల ప్రతిభను మెచ్చి కొందరు డబ్బులు గిఫ్ట్ గా ఇవ్వడం మొదలు పెడతారు. అయితే ఇప్పుడు డిజిటల్ యుగం మొదలైంది. సర్వసాధారణంగా ప్రజల చేతిలో డబ్బులు ఉండడం లేదు. అందుకనే తమకు ఇవ్వాలని  ఉన్నా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుంది. అటువంటి పరిస్థితిలో.. ఒక డోలు వాయిస్తున్న వాయిద్య కళాకారుడు డిజిటల్ కాలంలో ఉన్నట్లుగానే ఆలోచించాడు

Viral News: డిజిటల్ యుగంలో డ్రమ్మర్ సూపర్బ్ తెలివి.. క్యూఆర్‌ కోడ్ ఓపెన్ చేసి గిఫ్ట్ ఇవ్వమంటూ..
Viral News

Updated on: Sep 29, 2023 | 12:25 PM

మనదేశంలో పెళ్లిళ్లలో, జాతరలో, దేవుడి ఊరేగింపు సమయంలో సన్నాయి, డప్పులు వాయిద్యాలను ఉపయోగిస్తారు. ఇక పెళ్లి ఊరేగింపులో బ్యాండ్ మేళం లేదా డోలు సన్నాయి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. డోలు సన్నాయి రాగయుక్తంగా వాయిస్తుంటే ఆహుతులతో పాటు.. వధూవరులు తన్మయత్వంలో డ్యాన్స్ చేయడం మొదలు పెడతారు. అదే సమయంలో డోలు, సన్నాయి, డ్రమ్స్ వాయించే వాయిద్య కళాకారుల ప్రతిభను మెచ్చి కొందరు డబ్బులు గిఫ్ట్ గా ఇవ్వడం మొదలు పెడతారు. అయితే ఇప్పుడు డిజిటల్ యుగం మొదలైంది. సర్వసాధారణంగా ప్రజల చేతిలో డబ్బులు ఉండడం లేదు. అందుకనే తమకు ఇవ్వాలని  ఉన్నా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుంది.

అటువంటి పరిస్థితిలో.. ఒక డోలు వాయిస్తున్న వాయిద్య కళాకారుడు డిజిటల్ కాలంలో ఉన్నట్లుగానే ఆలోచించాడు. తన ప్రతిభ నచ్చి మెచ్చి ఎవరైనా బహుమానం ఇవ్వాలనుకుంటే వారి కోసం అద్భుతమైన ఆలోచన చేశాడు. అందుకు తగిన ఏర్పాటు చేసాడు. ఇది చూసిన తర్వాత ఎవరైనా షాక్ తినాల్సిందే. అంతేకాదు ఆ కళాకారుడు తెలివిని వినియోగదారులు ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ చిత్రాన్ని చూడండి

వైరల్ అవుతున్న చిత్రంలో  డ్రమ్మర్ తన డ్రమ్ మీద తన మొబైల్‌లో క్యూఆర్‌ కోడ్ ని ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాడు. ఎవరైనా వేడుక సందర్భంగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే డ్రమ్‌పై అమర్చిన ఉన్న క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఇవ్వచ్చు.

ఈ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ xలో షేర్ చేశారు.  ఈ ఫోటో పలువురిని ఆకట్టుకుంది. తమ అభిప్రాయాన్ని భిన్నమైన పద్ధతుల్లో తెలియజేస్తున్నారు. ఒకరు భయ్యా నీ ఈ జుగాడ్ నిజంగా అద్భుతమైనది.’ అని అంటే.. మరొకరు ‘అవును సోదరా, డిజిటల్ ప్రపంచంలో నగదు లావాదేవీల గురించి ఎవరు పట్టించుకుంటారని కామెంట్ చేశారు. అంతేకాదు నీ తెలివి అద్భుతం.. ఇప్పుడు డబ్బు నేరుగా నీఖాతాలోకి వెళ్తుంది అంటూ రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..