Viral News: ఆ దేశంలో జైళ్లకు కుక్కలకు బదులుగా బాతులు కాపలా.. అధికారులు ఏమి చెప్పారంటే..

|

Dec 24, 2023 | 12:07 PM

మీడియా కథనాల ప్రకారం ఈ జైలులో కెమెరాలు అమర్చబడ్డాయి. అయినప్పటికీ ఒకప్పుడు జైళ్లకు కాపలాగా కుక్కలను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు వాటిని తొలగించి ఒక రకమైన పెద్దబాతులు కాపాలకోసం జైళ్ల వద్ద ఉంచుతున్నారు. జైల్లో ఎప్పుడు ఏం జరిగినా వెంటనే బాతులు సందడి చేస్తాయని చెబుతున్నారు. దీంతో అక్కడ ఉన్న సైనికులు వెంటనే అలర్ట్ అవుతారు.

Viral News: ఆ దేశంలో జైళ్లకు కుక్కలకు బదులుగా బాతులు కాపలా.. అధికారులు ఏమి చెప్పారంటే..
Viral News
Follow us on

ఏ దేశంలోనైనా జైళ్లలో భద్రతా నిర్వహణ కోసం కఠినమైన ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు,  సమాజానికి ముప్పు కలిగించే ఖైదీలు చాలా మంది జైళ్లలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో  అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో భద్రతా కెమెరాలతో పాటు భద్రతను అందించే కుక్కలు కూడా సైనికులతో విధులను నిర్వహిస్తూ ఉంటాయి. అయితే జైలు భద్రత కోసం బాతులను మోహరించినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రస్తుతం ఇలాంటి ఉదంతం వెలుగులోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ వింత సంఘటన బ్రెజిల్ రాష్ట్రం శాంటా కాంటారినాలో చోటు చేసుకుంది. గతంలో ఇక్కడి జైల్లో కుక్కలు పని చేసేవి..  ఇప్పుడు వాటిని తొలగించి ఆ విధులను బాతులు నిర్వహిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం ఈ జైలులో కెమెరాలు అమర్చబడ్డాయి. అయినప్పటికీ ఒకప్పుడు జైళ్లకు కాపలాగా కుక్కలను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు వాటిని తొలగించి ఒక రకమైన పెద్దబాతులు కాపాలకోసం జైళ్ల వద్ద ఉంచుతున్నారు. జైల్లో ఎప్పుడు ఏం జరిగినా వెంటనే బాతులు సందడి చేస్తాయని చెబుతున్నారు. దీంతో అక్కడ ఉన్న సైనికులు వెంటనే అలర్ట్ అవుతారు.

ఇవి కూడా చదవండి

ఎందుకు బాతులను ఎంపిక చేశారంటే..

ఈ నిర్ణయానికి సంబంధించి జైలు డైరెక్టర్ మార్కోస్ రాబర్టో డి సౌజా మాట్లాడుతూ.. ఈ జైలు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని… పగలు, రాత్రి తేడా లేకుండా ఇక్కడ అంతా ఒకేలా ఉందన్నారు. అటువంటి ప్రదేశంలో బాతులను ఉంచడం చాలా సులభం. ఈ బాతులు జైలు లోపలి, బయటి ఆవరణలో సంచరిస్తుంటాయి. ఖైదీల్లో ఏ ఖైదీలోనైనా కదలిక వచ్చిన వెంటనే.. బాతు వెంటనే అరుస్తుంది. అంతేకాదు బాతుల నిర్వహణ కూడా సులభం.. చౌకగా ఉంటుంది. అందుకే జైలు కావాలా కోసం బాతులను  ఎంచుకున్నామని చెప్పారు.

అయితే ఇలా జైలు వద్ద బాతులు కాపలా కాయటం కొత్త విషయం ఏమీ కాదు. బ్రెజిల్ దేశంలోని అనేక ఇతర జైళ్ల దగ్గర కూడా బాతులు భద్రత కల్పిస్తున్నాయి. ఈ పక్షులు కుక్కల కంటే శబ్దాన్ని బాగా వింటాయని.. ఆ తర్వాత శబ్దం చేయడం ప్రారంభిస్తుందని నిపుణులు నమ్మకం. అందుకే బాతులను జైలుకు కాపలాగా ఉంచారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..