చేసే పనిని చిన్నదా పెద్దదా అని ఆలోచించరాదు అని పెద్దలు చెబుతారు. ఎందుకంటే మనం చిన్నదిగా భావించే పని చేస్తున్న వారు కృషి, పట్టుదలతో ఎవరూ ఊహించని విధంగా అతి తక్కువ సమయంలోనే గొప్పవారిగా మారి మన కనుల ముందు నిలుస్తారు. ప్రస్తుతం ఇలాంటి కథే ఇంటర్నెట్ లో చర్చనీయాంశమైంది. ఇది తెలిసిన తర్వాత ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. అంతేకాదు ఏ పనిని చిన్నదిగా భావించి ఇక నుంచి తప్పు చేయరు. వైరల్ అవుతున్న ఈ ఘటన బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్ కు సంబంధించింది. ప్రసుత్తం ఈ క్యాబ్ డ్రైవర్ గురించి ఓ రేంజ్ లో చర్చ నడుస్తోంది.
ఒక వినియోగదారుడు తన రెడ్డిట్ ఖాతాలో పోస్ట్ చేసిన వార్త ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో క్యాబ్ డ్రైవర్ నెలవారీ ఆదాయాన్ని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయగానే చక్కర్లు కొట్టడం మొదలు పెట్టింది. భారీ సంఖ్యలో ప్రజల దృష్టిని ఆకర్షించింది. తాను ఒక ఫంక్షన్ నుండి తిరిగి వస్తూ ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నానని పేర్కొన్నాడు. అప్పుడు డ్రైవర్ తో మాట్లాడుతూ రోజువారీ ఆదాయం గురించి సరదాగా అడగడం ప్రారంభించినట్లు పేర్కొన్నాడు. అప్పుడు ఆ డ్రైవర్ తాను రోజుకు రూ. 3000 నుండి రూ. 4000 వరకు సులభంగా సంపాదిస్తానని చెప్పాడని వెల్లడించాడు.
You Won’t Believe How Much This Cab Driver Earns Daily!
by inBengaluru ఇవి కూడా చదవండి
తన పోస్ట్‌లో డ్రైవర్ రోజువారీ సంపాదనను ప్రస్తావిస్తూ రూ. 3000 .. అంటే అతను నెలలో 25 రోజులు పనిచేస్తే.. నెలకు మొత్తం రూ. 75000 అని పేర్కొన్నాడు. అంతేకాదు తాను డ్రైవర్ తో మాట్లాడుతున్నప్పుడు అతను ఇంతకుముందు ఒక కార్పొరేట్‌లో ఉద్యోగం చేసినట్లు చెప్పాడు. అయితే తన ఉద్యోగం పోయిన తర్వాత కాబ్ డ్రైవర్ గా మారినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఆ వ్యక్తికి సంబంధించిన ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఒకరు మీరు కష్టపడి పనిచేసేవారు.. నమ్మదగినవారు అయితే.. ఏ పని చేసినా డబ్బు సంపాదించవచ్చు. మరొకరు సాధారణంగా ఆ క్యాబ్ డ్రైవర్ విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్‌కు మాత్రమే వెళ్తాడు అని రాశాడు. మరొకరు దీనిపై వ్యాఖ్యానిస్తూ.. ‘సోదరా! ఈ కుర్రాడి ఆదాయం కూడా బాగానే ఉంది.. అతనే యజమాని. అంటూ ఈ పోస్ట్ పై రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..