Viral: గాలానికి చిక్కిన భారీ చేప.. పొట్టలో ఏవో గట్టి వస్తువులు.. కోసి చూడగా నవ్వులే నవ్వులు

గాలానికి భారీ చేప చిక్కింది. దాని పొట్టలో ఏవో గట్టి వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ఇంటికి తీసుకువచ్చి దాన్ని కడుపు చీల్చగా.....

Viral: గాలానికి చిక్కిన భారీ చేప.. పొట్టలో ఏవో గట్టి వస్తువులు.. కోసి చూడగా నవ్వులే నవ్వులు
Catfish
Follow us

|

Updated on: Jun 27, 2022 | 4:33 PM

United States: అమెరికాలో కొందరికి చేపల పట్టడం ఓ హాబీ. చాలామంది వారాంతాల్లో అలా పడవలో వెళ్లి నదిలో చేపలు పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇండియానా(Indiana) రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమకు ఎంతో ఇష్టమైన నీలి రంగు క్యాట్ ఫిష్ పట్టేందుకు ఒహియో నదిలోకి బోటు సాయంతో వెళ్లారు. అయితే వారికి చిక్కిన చేప కడుపులో ఓ ఊహించని వస్తువు లభ్యమైంది. అదేంటో తెలిస్తే మీరు ఒకింత షాక్‌ అవుతారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రిచర్డ్ కేసర్ తన స్నేహితుడు జోన్ హూప్‌ కలిసి వీకెండ్‌లో చేపలు పట్టేందుకు వెళ్లారు. గాలం వేయగా ఓ భారీ చేప చిక్కింది. ఆ చేపను పడవలోకి లాగుతున్నప్పుడు దాని కడుపు పెద్దగా ఉండటం వారు గమనించారు. చిన్న చేపలు లేదా తాబేళ్లు, మరోదైన ఇతర నీటి జీవులను అది తిని ఉండవచ్చని అనుకున్నారు. ఈ క్రమంలోనే మరో 2 క్యాట్‌ఫిష్‌లను పట్టుకున్నారు. అయితే తొలుత చిక్కిన చేప పొట్టపై నొక్కినప్పుడు లోపల ఏదో గట్టి వస్తువులు ఉన్నట్లు వారికి అనిపించింది. ఇంటికి వెళ్లాక ఆ చేప కడుపలో ఏముందో చూడాలని కేసర్ ఆరాటపడ్డాడు. వెంటనే ఇంటికి తీసుకెళ్లి దాని కడుపు చీల్చగా… లోపల ఓ పెద్ద బంతితో పాటు అనూహ్యంగా సెక్స్ టాయ్‌ను కనుగొన్నారు. ఆ టాయ్ ఒహియో నదిలోకి ఏదో ప్రవాహం నుంచి వచ్చి ఉండొచ్చని.. ఆ తర్వాత చేప.. దాన్ని ఆహారం అనుకుని మింగేసి ఉంటుందని కేసర్ అభిప్రాయడప్డాడు. అయితే సదరు చేపను కట్ చేస్తున్నప్పుడు… కేసర్ భార్య.. అతని 3 ఏళ్ల కుమార్తె కూడా పక్కనే ఉన్నారు. అయితే చేప కడుపులో సెక్స్ టాయ్ కనిపించగానే.. కేసర్ అతని భార్య గట్టిగా నవ్వడం ప్రారంభించారు. అతని భార్య వెంటనే కుమార్తె కళ్లు మూసి అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లింది. ఫేస్‌బుక్‌లో ఈ బ్లూ క్యాట్‌ఫిష్ గురించి పోస్ట్ చేయగా.. విపరీతంగా షేర్ చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి