మనవరాలు చేసిన పనికి.. అమ్మమ్మ ఖాతా నుంచి రూ.80 లక్షలు ఖాళీ
ఓ బాలిక చేసిన పొరపాటు తీవ్ర అనర్థానికి దారి తీయడమే కాకుండా తన అమ్మమ్మ బ్యాంక్ అకౌంట్‌లోని 80 లక్షల రూపాయలు పోగొట్టుకునేలా చేసింది. అయితే స్కూల్ టీచర్ సహాయంతో ఆ కుటుంబం మోసం నుంచి బయటపడగలిగింది. అసలేం జరిగిందంటే..గురుగ్రామ్‌కు చెందిన ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని మాటల మధ్యలో తాము భూమిని అమ్మేయగా 80 లక్షల రూపాయలు వచ్చాయని..అవి తన అమ్మమ్మ ఖాతాలో ఉన్నాయని తన స్నేహితురాలికి చెప్పింది.
ఆ విషయాన్ని పదో తరగతి విద్యార్థి విన్నాడు. ఆ డబ్బులను ఎలాగైనా కాజేయాలని ఆ విద్యార్థికి దుర్బుద్ధి పుట్టడంతో ఈ విషయం గురించి తన సోదరుడికి చెప్పాడు. వీరు మరికొందరితో కలిసి వృద్ధురాలి వద్ద ఉన్న డబ్బు కాజేయాలని ప్లాన్ చేశారు. అనుకున్న విధంగానే సుమిత్ కటారియా అనే యువకుడు అన్‌లైన్‌లో బాలికతో పరిచయం పెంచుకుని ఆమె ఫొటోలు సేకరించాడు. అనంతరం వాటిని మార్ఫింగ్ చేసి..డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో తన అమ్మమ్మకు తెలియకుండా విద్యార్థిని పలు దఫాలుగా వారి అకౌంట్లకు నగదు బదిలీ చేసింది. డబ్బులన్నీ అయిపోయినా కూడా వారు బెదిరింపులు కొనసాగిస్తుండడంతో ఆ విషయాన్ని బాలిక తమ టీచర్‌కు చెప్పింది. ఆమె సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేసారు. నిందితుల నుంచి 36 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెమ్మదిస్తోన్న ఆ సముద్ర ప్రవాహంతో భారీ ముప్పు
ఉల్లి, వెల్లుల్లిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
‘హీరోలను పొగడడానికే హీరోయిన్లు’ సౌత్ సినిమాలపై జ్యోతిక సంచలన కామెంట్స్
స్మగ్లింగ్‌తో నెలకు రూ.3 కోట్ల ఆదాయం! ఈమె హీరోయిన్ కాదు.. జగత్ కిలాడీ
Chiranjeevi: చెల్లెలి మరణాన్ని తలుకుచుని.. ఎమోషనల్ అయిన చిరు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

