ఉల్లి, వెల్లుల్లిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
సాధారణంగా ప్రతి కూరలోనూ ఉల్లి, వెల్లుల్లి కామన్‌గా వాడుతుంటారు చాలామంది. వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ఇక ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి ఉండనే ఉంది. ఈ క్రమంలో ఈ రెండిటినీ కలిపి వాడటం మంచిదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
ఉల్లి, వెల్లుల్లి రెండిట్లోనూ యాంటి ఫంగల్, యాంటి బ్యాక్టీరియల్, యాంటి వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి, ఉల్లి, వెల్లుల్లిని కలిపి తీసుకోవడం మంచిదే అంటున్నారు నిపుణులు. అధిక రక్తపోటుతో బాధపడేవారు ఉల్లి, వెల్లుల్లిని కలిపి తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. అలా తినడం వల్ల కొంతకాలానికి ఈ సమస్య నుంచి విముక్తి లభించే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు, మైగ్రెయిన్ తో బాధపడుతున్న వారికి ఈ రెండు మంచి ఔషధాలుగా పనిచేస్తాయట. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు కూడా ఉల్లి, వెల్లుల్లి కలిపి తింటే మంచి ఫలితం ఉంటుందట. ఇవి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుడమే కాకుండా.. శరీరంలో కొవ్వు పేరుకోకుండా అడ్డుకుంటాయట. ఉల్లి, వెల్లుల్లిలో విటమిన్ బి, సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయంటున్నారు. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘హీరోలను పొగడడానికే హీరోయిన్లు’ సౌత్ సినిమాలపై జ్యోతిక సంచలన కామెంట్స్
స్మగ్లింగ్‌తో నెలకు రూ.3 కోట్ల ఆదాయం! ఈమె హీరోయిన్ కాదు.. జగత్ కిలాడీ
Chiranjeevi: చెల్లెలి మరణాన్ని తలుకుచుని.. ఎమోషనల్ అయిన చిరు
బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే మీ అకౌంట్ బ్లాక్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

