Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: షాకింగ్.. చూస్తుండగానే ఎత్తుకు పెరుగుతున్న భూమి.. వీడియో వైరల్..

భూమి పెరగడం ఎప్పుడైనా చూశారా ? ఇప్పటివరకు పురాతన నగరాలు సముద్రంలోకి మునిగిపోయాయి.. కృష్ణుడు నడయాడిన నేల

Viral video: షాకింగ్.. చూస్తుండగానే ఎత్తుకు పెరుగుతున్న భూమి.. వీడియో వైరల్..
Land Rising
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 23, 2021 | 12:42 PM

భూమి పెరగడం ఎప్పుడైనా చూశారా ? ఇప్పటివరకు పురాతన నగరాలు సముద్రంలోకి మునిగిపోయాయి.. కృష్ణుడు నడయాడిన నేల సైతం సముద్ర గర్భాణా ఉందనే మాటలు విన్నాం కదా.. అలాగే ప్రస్తుతం కాలంలో భూమి కుంగి పోవడం వంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఉన్నట్టుండి భూమి కుంగిపోవడం.. పెద్దగా గుంత పడడం వంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే భూమి అంతకు అంత పెరిగిపోవడం ఇప్పుడు చాలా వరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ఘటన మరే దేశంలో జరగలేదు. మన ఇండియాలోని హర్యానా రాష్ట్రంలో భూమి అందరూ చూస్తుండగానే పెరుగుతూ.. ఉబ్బినట్లుగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియో.. ఓ కాలువలో అడుగున ఉన్న ప్రాంతం ఒక్కసారిగా పెరిగిపోవడం ప్రారంభించింది. ఏదో కాస్త పెరిగి ఆగిపోలేదు. దాదాపు మనిషి ఎత్తును మించి భూమి పెరిగిపోయింది. దీంతో అక్కడే ఉన్నవారు షాక్‏కు గురయ్యారు. వెంటనే ఈ షాకింగ్ దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించి.. ఇంటర్నెట్‏లో షేర్ చేయగా.. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే భూమి పెరగడానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. టెక్టోనిక్ కార్యకలాపాల వల్ల భూమి పెరిగిందని కొందరు అంటుండగా.. మరికొందరు భూమిలో ఉన్న మిథేన్ వలన ఇలా జరిగిందని వాదిస్తున్నారు. మీరు ఆ వీడియోను ఒకసారి చూసేయ్యండి.

వీడియో..

Also Read: రోజూ ఈ చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారా ? అయితే జాగ్రత్త సుమా.. ఆరోగ్యానికి యమ డేంజర్ అంటున్న నిపుణులు..

పీసీసీ చీఫ్‌గా సిద్ధూ ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో విషాధ ఛాయలు.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తుల దుర్మరణం

Karthika Deepam Latest: ఎమోషనల్ ట్విస్ట్..మూడంకెలు లెక్కపెట్టిన మోనిత.. కార్తీక్ ను అసహ్యించుకుంటున్న తండ్రి..సర్ది చేప్పే ప్రయత్నంలో వంటలక్క!

Sonam Kapoor: ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు అలా ఫుల్‌స్టాప్ పెట్టిన టాప్ హీరోయిన్.. అసలు విషయం ఇదే అంటూ..