
అమెరికాకు చెందిన ఒక మహిళ బాహుబలి వంటి బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో పసికందు ఫోటోలు వైరల్‌గా మారాయి. లక్షలాది మందిని ఆశ్చర్యపరిచింది. అమెరికా నివాసి అయిన షెల్బీ మార్టిన్ ఇటీవల తన నవజాత శిశువు సైజును వెల్లడించడం ద్వారా ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. షెల్బీ తన కుమారుడు కాసియన్ పుట్టిన వెంటనే ఆసుపత్రి రికార్డులను బద్దలు కొట్టాడని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ, షెల్బీ తన గర్భధారణ సమయంలో, బిడ్డ పుట్టిన వెంటనే తీసిన ఫోటోలను షేర్ చేసింది.
మొదటి ఫోటోలో, షెల్బీ తన డెలీవరికి ముందు హాస్పిటల్‌లో గౌనులో నిలబడి ఉంది. ఆమె చాలా పెద్ద బేబీ బంప్‌తో బిడ్డ ఎంత పెద్దదిగా ఉందో అనే ఆలోచనను కలిగిస్తుంది. ఆ తదుపరి ఫోటోలో ఆమె కుమారుడు కాసియన్ పుట్టిన వెంటనే ఎలా ఉన్నాడో షేర్ చేసింది. వాడు ప్రజలను పూర్తిగా ఆశ్చర్యపరిచాడు. కాసియన్ పుట్టినప్పుడు దాదాపు 12 పౌండ్ల 14 ఔన్సుల (6 కిలోలు) బరువుతో పుట్టాడు. అయితే పిల్లలు సాధారణంగా 3 కిలోల వరకు బరువు ఉంటారు. కానీ, కాసియన్ జననం చూసి ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు.
గత మూడు సంవత్సరాలలో కాసియన్ అక్కడ జన్మించిన అత్యంత బరువైన శిశువు అని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. ఇంకా, ఆ బిడ్డ తన తల్లి పుట్టినరోజున జన్మించాడు. దీనిని షెల్బీ ఆమె జీవితంలో గొప్ప బహుమతిగా అభివర్ణించారు. వారి వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో కామెంట్స్ వెల్లువెత్తాయి. చాలా మంది ఆ తల్లీ బిడ్డకు అభినందనలు తెలియజేశారు. కానీ,మీరు బాగున్నారా? అని అడిగారు. మరికొందరు దయచేసి మీకు సి-సెక్షన్ జరిగిందా అని అడుగుతున్నారు. చాలా మంది నవజాత శిశువు పరిమాణాన్ని చూసి షాక్ అవుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..