
ప్రతిరోజూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోలంటే సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం, ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మొదట్లో దీన్ని ఖచ్చితంగా గుర్తించలేరు. ఇది AI వీడియోనా..? అనే సందేహం కూడా కలుగుతుంది. కాదు ఇది నిజంగానే మనిషి చేస్తున్న స్టన్నింగ్ స్టెప్స్ అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవచ్చు. కానీ, ఇది AI వీడియో కాదు, ఒక వ్యక్తిలో దాగివు్న అద్భుత ప్రతిభకు నిదర్శనం. ఇక్కడ ఒక వ్యక్తి తనను తాను మొసలి, కప్ప, కోతిని వంటి విభిన్న జీవులను అనుకరిస్తూ చూపించే వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
ఈ 43 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి ఒకేసారి మొసలి, కప్, కోతితో ఇలా మూడు, నాలుగు రకాల జంతువుల నడకను అనుకరిస్తూ చూపించాడు. ఈ వీడియో ఏదో ఒక బీచ్‌లో షుట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అక్కడ బీచ్‌లో ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరూ సముద్ర దృశ్యాలను, ఆ వ్యక్తి ప్రదర్శనను ఆస్వాదిస్తున్నారు. ఈ వైరల్ వీడియో చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు. ఆ వ్యక్తి ట్యాలెంట్‌ని చూసి ఫిదా అవుతారు. అతన్ని ప్రశంసించకుండా ఉండలేరు. ఈ వీడియోను @mdtanveer87 అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయబడింది.
వైరల్ వీడియోలు ముందుగా అతను మొసలి అయ్యాడు. తరువాత కోతి అయ్యాడు! ఇప్పుడు సూపర్‌మ్యాన్ మాత్రమే మిగిలి ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు ఏకంగా నేషనల్ జియోగ్రాఫిక్ మొత్తాన్ని తన హావభావాలతో చిత్రీకరించాడు. ఇలాంటివి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.
వీడియో ఇక్కడ చూడండి…
पहले मगरमच्छ बना… फिर बंदर! अब बस सुपरमैन बाकी है 😭
भाई ने पूरा नेशनल जियोग्राफिक अकेले शूट कर दिया 🤣 क्या पहले कभी देखें है,, pic.twitter.com/BXxxPjPIYB
— TANVEER (@mdtanveer87) November 9, 2025
ఇంటర్నెట్‌లో వైరల్ అయిన ఈ వీడియోను చూసిన తర్వాత, వినియోగదారులు కూడా భిన్నమైన కామెంట్స్ చేశారు. నిజంగా అతను చేసే పని అంత సులభం కాదు.. అతని శరీరంలో ఎముకలు కాకుండా రబ్బరు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకే మనిషిలో మొసలి నుండి కోతి వరకు జరిగిన ప్రయాణం అద్భుతంగా ఉంది. ఇప్పుడు అది ఎగరడానికి మలుపు మాత్రమే, సూపర్‌మ్యాన్ మోడ్ ఆన్ కానుంది..అంటూ ప్రజలు చాలా రకాలుగా స్పందించారు. ఈ వీడియోను 43 వేలకు పైగా వీక్షించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…