Viral Video: అరె ఇలా ఉన్నారేంట్రా.. బురదలో పడ్డా వదిలిపెట్టలేదుగా.. వీడియో చూస్తే షాకే..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. అబ్బ.. ఎంచక్కా చలికాచుకోవచ్చు అని సంబరపడ్డాడట ఇంకొకడు.. ఈ సామేతను మనం తరచూ వింటుంటాం.. వాడుతుంటాం.. దీని అర్థం ఏంటంటే.. ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు, మరొకరు తమ స్వార్థం కోసం ఆలోచించడం అన్నమాట.. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. అబ్బ.. ఎంచక్కా చలికాచుకోవచ్చు అని సంబరపడ్డాడట ఇంకొకడు.. ఈ సామేతను మనం తరచూ వింటుంటాం.. వాడుతుంటాం.. దీని అర్థం ఏంటంటే.. ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు, మరొకరు తమ స్వార్థం కోసం ఆలోచించడం అన్నమాట.. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రిఫైన్డ్ ఆయిల్ (వంట నూనె) లోడుతో వెళ్తున్న ఓ ట్యాంకర్ బోల్తా కొడితే.. ఆయిల్ నింపుకోడానికి బకెట్లతో ఎగబడ్డారు స్థానికులు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మంగళవారం ఉదయం అమేథి జిల్లాలోని కామరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వారణాసి-లక్నో జాతీయ రహదారిపై కథోరా గ్రామం సమీపంలో జరిగింది.
అమేథిలోని వారణాసి-లక్నో హైవేపై రిఫైన్డ్ ఆయిల్ లోడుతో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ట్యాంకర్ మూత ఓపెన్ అయిపోయి ఆయిల్ మొత్తం రోడ్డుపాలైపోయింది. పెద్దమొత్తంలో ఆయిల్ ఒలికిపోవడంతో ఆ ప్రదేశం అంతా బురదగా మారిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే.. ట్యాంకర్ లోని నూనె కింద పడి నేలపాలైంది.. అది చూసి స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి పరుగెత్తుకొచ్చారు. కానీ వాళ్లు వచ్చింది డ్రైవర్‌ను కాపాడటానికి అనుకుంటే పొరపాటే… డ్రైవర్‌ను కనీసం చూడను కూడా చూడలేదు వారు.. ట్యాంకర్‌నుంచి లీకయిన ఆయిల్‌ను తమ వెంట తెచ్చుకున్న డబ్బాలు, బకెట్లలో నింపుకోవడంలో మునిగిపోయారు.
వీడియో చూడండి..
ఈ ఘటనపై ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను వెంటనే స్థానిక ఆస్పత్రికి చికిత్సకోసం తరలించారు. ఆయిల్ దోచుకుంటున్న వారిని తరిమి కొట్టారు..
గాయపడిన ట్యాంకర్ డ్రైవర్‌ను బారాబంకిలోని బహదూర్‌పూర్ హైదర్‌గఢ్ ప్రాంతానికి చెందిన రామ్ మిలన్ కుమారుడు రామ్‌రాజ్‌గా గుర్తించారు. సుల్తాన్‌పూర్ నుండి లక్నోకు ఆయిల్‌ను శుద్ధి చేసిన నూనెను తీసుకెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన బోల్తా పడిందని ఒక పోలీసు అధికారి తెలిపారు.
అయితే.. బోల్తా పడిన ట్యాంకర్ సమీపంలో బురదమయమైన రహదారిపై గ్రామస్తులు తాము తెచ్చుకున్న బిందెలు, డబ్బాల్లో నూనెను నింపుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
