Eco Friendly: యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం ఒక్క భారత్ లోనే కాదు… ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ విచ్చలవిడిగా ఉంది. వీటివల్ల పర్యావరణానికి ముప్పు అని తెలిసినా వేరే ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్లనో, ఇతర కారణాలతోనే వాటినే వాడుతుంటాం. అయితే తాజాగా ఓ కొత్త రకం ఫుడ్ కంటైనర్లు ఈ ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. వరిపొట్టుతో తయారైన గ్లాసులు, ప్లేట్లకు సంబంధించిన ఓ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. “ఈ ఫుడ్ కంటైనర్లు వరి పొట్టుతో తయారయ్యాయి. ఇవి లీక్ అవ్వవు, తక్కువ ధరకే లభిస్తాయి, భూమిలో తేలిగ్గా కరిగిపోతాయి, పర్యావరణానికి మేలు చేస్తాయి” ఇకనైనా తమిళనాడులోని హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్లలో ప్లాస్టిక్ వాడకం ఆపేసి… ఇలాంటి పర్యావరణ హితమైనవి వాడాలి” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఐఏఎస్ అధికారి చేసిన ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారి పోస్ట్ చేసిన ఈ వీడియోను వీక్షిస్తున్న లక్షలమంది నెటిజన్లు రీ ట్వీట్ చేస్తున్నారు. రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఓ సామాన్యుడిగా నాలాంటి వాళ్లు ఎలా ఆలోచిస్తారంటే… ప్లాస్టిక్ వాడకం తేలిక. అది త్వరగా పగలదు. నీటిలో నానదు. వర్షంలో కూడా వాడుకోవచ్చు. ఈ కోణంలో ఆలోచించి సమస్యను పరిష్కరించాలి” అని ఓ యూజర్ కోరగా.. “రైస్ బ్రాన్ చాలా ఖరీదైనది. దానితో ఇలాంటివి చేస్తే… ఆవులు, గేదెలకు ఆహార సమస్య వస్తుంది. మనం ఈ అంశాల్ని బ్యాలెన్స్ చెయ్యాల్సి ఉంటుంది” అంటూ మరో యూజర్ స్పందించారు. “ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ వరి పొట్టు పశువులకు ఆహారంగా చాలా అవసరం. థాయిలాండ్‌లో దీని నుంచి నూనెను తీస్తున్నారు. అందువల్ల రైస్ బ్రాన్‌కి పోటీ ఎక్కువ ఉంటుంది. ఈ దిశగా పరిశోధన చెయ్యాలి” అని మరో యూజర్ కోరారు. gfx వరి పొట్టుతో గ్లాసులు, ప్లేట్స్.. గుడ్ బై ప్లాస్టిక్..! ఇకపై హోటల్స్‌లో ఇవి వాడితే బెటర్ అంటున్న ఐఏఎస్ అధికారి భిన్న రకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు
Food containers made out of rice bran are leak proof, affordable, disposable and earth friendly. Hotels,restaurants food joints, its time for you to stop using banned plastic packaging in TN and switch to sustainable eco alternatives #meendummanjappai #Manjapai pic.twitter.com/n4U2x0gNur
— Supriya Sahu IAS (@supriyasahuias) December 29, 2021
Also Read: పవన్ కళ్యాణ్ లోపాలను సరిచేసుకోలేదు.. కాపు ఉద్యమ నాయకుడు ఆరేటి ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు..