Watch Video: హృదయాన్ని కరిగించే అద్భుతమైన వీడియో.. స్పృహతప్పి పడిపోయిన కుక్కను రక్షించిన దంపతులు.. చూస్తే అభినందించాల్సిందే..
వేగంగా వెళ్లే వాహనాల కింద పడిపోవడం, చిక్కుకోవడం వల్ల ప్రతిరోజూ వందలాది కుక్కలు, జంతువులు రోడ్డు ప్రమాదంలో గాయపడుతున్నాయి. మరి కొన్ని సందర్భాలలో..
వేగంగా వెళ్లే వాహనాల కింద పడిపోవడం, చిక్కుకోవడం వల్ల ప్రతిరోజూ వందలాది కుక్కలు, జంతువులు రోడ్డు ప్రమాదంలో గాయపడుతున్నాయి. మరి కొన్ని సందర్భాలలో అవి చనిపోతున్నాయి కూడా. ఇక చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే వాటిని చూసినవారిలో కొందరు వాటికి సహాయం చేస్తుంటారు. వాటికి తమ వంతుగా ఎంతో కొంత సహాయపడి వాటి ప్రాణాలను రక్షిస్తుంటారు. అచ్చం అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు మీద పడిపోయి ఉన్న కుక్కను చూసిన దంపతులు దానిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి దాని ప్రాణాలను కాపాడారు.
ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. kartavyasociety అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వైరల్ వీడియోలో ఒక కుక్క రోడ్డు మీద పడిపోయి ఉండడాన్ని మనం చూడవచ్చు. అటుగా వెళ్తున్నవారు దానిని చూస్తున్నారే కానీ పట్టించుకోవడంలేదు. అయితే ఇంతలో అటుగా వచ్చిన దంపతులు దానిని చూసి తమ బండిని ఆపారు. ఇక వారు ఆ కుక్కను తీసుకుని ఆసుపత్రికి వెళ్లడం, దానికి చికిత్స చేయించడం వంటి దృష్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..
View this post on Instagram
కాగా, జనవరి 16న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. వీడియోను చూసిన నెటిజన్లు ఆ జంటను అభినందిస్తూ ప్రశంసిస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 13 లక్షల 48 వేల లైకులు.. కోటికి పైగా వీక్షణలు అందాయి. అదే క్రమంలో అనేక మంది నెటిజన్లు వారి వారి స్పందనలకు తమ కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇలాంటి దయగల వ్యక్తుల వల్ల ప్రపంచం తేలికగా ఊపిరి పీల్చుకుంటోందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇలాంటి పనులను అందరూ చేయాలని చాలా మంది ఆకాంక్షించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..