Watch Video: వామ్మో.. ఈ కుర్రాడు మాములోడు కాదు..! పాము కోసం ప్రాణాలనే పణంగా పెట్టాడు.. చివరకు ఏమయ్యిందంటే..?

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సరదాగా నవ్విస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాగే సాహసాలకు..

Watch Video: వామ్మో.. ఈ కుర్రాడు మాములోడు కాదు..! పాము కోసం ప్రాణాలనే పణంగా పెట్టాడు.. చివరకు ఏమయ్యిందంటే..?
Boy Rescuing Snake From Well

Updated on: Feb 04, 2023 | 8:20 AM

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సరదాగా నవ్విస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాగే సాహసాలకు ప్రయత్నించేవారిని వెలుగులోకి తీసుకురావడంలో కూడా సోషల్ మీడియా పాత్ర ప్రత్యేకమైనది. ఇక ఈ సాహసీకులు చేసే  ప్రయత్నాలు వారికి సంబంధించిన కొన్ని వీడియోలు మాత్రం మనల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా.. బావిలో పడిన పామును ఓ యువకుడు అతి కష్టం మీద కాపాడాడు. ఆ పాము బుసలు కొడుతూ ఎదురు తిరిగినప్పటికీ.. ఆ వ్యక్తి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పామును సురక్షితంగా బావిలో నుంచి రక్షించాడు. ఇక అతను చేసిన సహాసాన్ని సోషల్ మీడియా వేదికగా చూసి వారందరూ నివ్వెరపోతున్నారు.

అయితే  పాము బుసలు కొడుతూ మీదకొచ్చినప్పటికీ.. ఏ మాత్రం భయపడకుండా బలేగా కాపాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా  మారింది. official_sarpmitra12_ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోను మనం చూడవచ్చు. ఈ వీడియోలో ఒక యువకుడు బావిలో పడిన పామును రెస్క్యూ చేసేందుకు ఏంతో సాహసోపేతంగా ప్రయత్నించి సఫలీకృతుడు అవడాన్ని కూడా మనం చూడవచ్చు. అయితే ఈ క్రమంలో అతను తన ప్రాణాలనే  పణంగా పెట్టి దాని రక్షించాడు. ఇంకా ఆ పాము నానా రచ్చ చేసింది అని కూడా చెప్పుకోవాలి.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి.. 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..