AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఒకే మనిషిని పోలిన వ్యక్తులు ఏడుగురు ఉంటారనేది నిజమేనేమో.. వైరల్ అవుతున్న వీడియో.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

వీడియోలోని వ్యక్తి పానీపూరి అమ్ముతూ రాజకీయ నేత లాగానే ఫోజులు కూడా ఇస్తున్నాడని వారు కామెంట్లు చేస్తున్నారు. ఆ వ్యక్తి చూడడానికి అచ్చం మన..

Watch Video: ఒకే మనిషిని పోలిన వ్యక్తులు ఏడుగురు ఉంటారనేది నిజమేనేమో.. వైరల్ అవుతున్న వీడియో.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Pani Puri Seller
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 09, 2023 | 1:31 PM

Share

మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట. కొన్ని సార్లు అది నిజమే అనిపిస్తుంది కదా.. ఆ కారణంగానే మనం కొన్ని సార్లు నిజమైనవారిని గుర్తించడంలో పొరబడతాము. ఈ నేపథ్యంలోనే కోహ్లీ, సల్మాన్, అజయ్ దేవగన్ వంటి ప్రముఖులను పోలిన మనుషులకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి దేశంలోని ఓ అగ్రనేతలా అనిపిస్తున్నారని నెటిజన్లు భావిస్తున్నారు.  ఆ వీడియోలోని వ్యక్తి పానీపూరి అమ్ముతూ రాజకీయ నేత లాగానే ఫోజులు కూడా ఇస్తున్నాడని వారు కామెంట్లు చేస్తున్నారు. ఆ వ్యక్తి చూడడానికి అచ్చం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాగానే ఉన్నాడని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు నిజానికి అలాంటి పోలికలు ఏం లేవని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే ఇక్కడ చెప్పుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. వీడియోలోని వ్యక్తి కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడే. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా వల్లభ్ విద్యానగర్‌కు చెందిన అనీల్ భాయ్ ఠక్కర్ మాట్లాడుతూ ‘ఆయన టీ అమ్ముతాడు.. నేను పానీపూరీ అమ్ముతా’నని అంటున్నాడు. ఇక eatinvadodara అనే ఇన్‌‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో ఠక్కర్ షాపులోని వివిధ రకాల పూరీలను మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 6 లక్షల 11 వేల లైకులు.. 82 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో ఈ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నమైన స్పందనలు ఇచ్చారు. 70 శాతం వాయిస్ కూడా అందిందని కొందరంటే.. నిజంలో పెద్దగా తేడా లేదని మరికొందరు అంటున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘కాకా, మోడీజీ బయోపిక్‌లో ప్రధాన పాత్రను పొందవచ్చు, ప్రయత్నించండి’ అని రాయగా, మరొక నెటిజన్ ‘అనుమానమే లేదు చాచా.. ఒక రోజు మీరు కూడా ముఖ్యమంత్రి అవుతారు’ అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వందే భారత్ రైళ్లపై మరో కీలక అప్డేట్
వందే భారత్ రైళ్లపై మరో కీలక అప్డేట్
మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్
మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్
రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?