Trending Video: వీడెవడ్రా బాబు..! డాల్ఫిన్‌ను స్వారీ చేస్తున్నాడు.. వైరల్ వీడియోను మీరూ చూడండి..

మీరు ఎప్పుడైనా డాల్ఫిన్‌ను స్వారీ చేయాలనుకున్నారా..? అసలు ఆ ఆలోచన మీ మనసుకు తట్టిందా ఇంతక ముందు..? లేదా ఇంకా డాల్ఫిన్స్ మన..

Trending Video: వీడెవడ్రా బాబు..! డాల్ఫిన్‌ను స్వారీ చేస్తున్నాడు.. వైరల్ వీడియోను మీరూ చూడండి..
Little Boy Riding Dolphin

Updated on: Mar 02, 2023 | 7:57 AM

మనలో చాలా మందికి గుర్రం స్వారీ చేయాలనే కోరిక ఉంటుంది. అందుకే ఎక్కడైనా గుర్రం కనిపిస్తే దాని యజమానిని అడిగే ప్రయత్నం చేస్తుంటాం. దానిని స్వారీ చేస్తూ ఫోటోలను తీసుకుని, వాటిని సోషల్ మీడియాలో నలుగురికి కనిపించేలా చూయించుకోవాలని భావిస్తాం. కానీ మీరు ఎప్పుడైనా డాల్ఫిన్‌ను స్వారీ చేయాలనుకున్నారా..? అసలు ఆ ఆలోచన మీ మనసుకు తట్టిందా ఇంతక ముందు..? లేదా ఇంకా డాల్ఫిన్స్ మన మాట ఎందుకు వింటాయి..? మనం స్వారీ చేసేంత సమయం మనకి ఇస్తాయా..? అని ఆలోచిస్తున్నారా..?  తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక చిన్న పిల్లవాడు అలవోకగా దాన్ని స్వారీ చేస్తున్నాడు. దీంతో ఆ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.

meena_latha_07 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో మనం దానికి సంబంధించిన దృశ్యాలను చూడవచ్చు. నీటిలో వెళ్తున్న డాల్ఫిన్ పైన పట్టుకుని అలా కొంచెం దూరం వెళ్లి వెనక్కి వచ్చాడు. ఆ డాల్ఫిన్ కూడా చాలా ఇష్టంగా ఎక్కించుకుని తీసుకెళ్లింది. అయితే నెటిజన్లు కొందరు ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మూగ జీవికి ఏదైనా హాని కలగవచ్చని.. ఆ పిల్లవాడు లైఫ్ జాకెట్ వేసుకోలేేదని ఆగ్రహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..