ఈ ప్రపంచంలో అనేక రకాల జీవులు నివసిస్తున్నాయి. వాటిలో కొన్నిటిని మనం ప్రతిరోజూ చూస్తాము. అయితే కొన్ని జీవులు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాయి. అయితే భూమి మీద మాత్రమే కాదు నీటిలో కూడా నివసించే కొన్ని రకాల జీవులు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలా అరుదుగా కనిపించే జీవులను వింత జీవులుగా భావిస్తాం.. ఆసక్తికరంగా తిలకిస్తాం కూడా.. సముద్రంలో అనేక రకాలజీవులు నివసిస్తూ ఉంటాయి. వీటిల్లో కొన్ని జీవులు ప్రాణాలను తీసేటంత ప్రమాదకరమైనవి కూడా.. అయితే ప్రస్తుతం నెట్టింట్లో ఒక సముద్రంలోకి రహస్య జీవికి సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు అసలు ఈ జలచరం చేపా.. లేక ఆక్టోపస్ అనే విషయం అర్థం కాకా తలలు పట్టుకుంటున్నారు.
బ్రిటన్‌లో నివసిస్తున్న ఒక కుటుంబం బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన ఈ వింత సముద్ర జీవిని గుర్తించారు. ఈ జీవిని చూసి సముద్రంపై పరిశోధనలు చేసే నిపుణులు కూడా ఆశ్చర్యపోయారు. దాదాపు మూడు అడుగుల పొడవున్న ఈ జీవి నారింజ రంగులో ఉండి శరీరంపై నల్లటి మచ్చలు కలిగి ఉంది. దూరం నుండి చూస్తే చేపలా కనిపించింది. అయితే వాస్తవానికి అది చేప కాదు. దీని శరీర నిర్మాణ తీరు చూస్తే ఆక్టోపస్ లా కనిపిస్తోంది. అయితే ఈ నారింజ రంగులో ఉన్న ఈ వింత జీవి ఏది అనేది మాత్రం నిపుణులు కనిపెట్టలేకపోయారు.
LadBible అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం ఈ వింత జీవిని 36 ఏళ్ల గ్రెగ్ జెంకిన్సన్ కనుగొన్నారు. జెంకిన్సన్ తన కొడుకుతో కలిసి హాలీడే లో ఎంజాయ్ చెయ్యడానికి బీచ్ కి వెళ్ళాడు. అక్కడ అతని దృష్టి ఒక నారింజ రంగు జీవిపై పడింది. దూరం నుంచి చూస్తే అది ‘ఆక్టోపస్ టెంటకిల్’ లాగా అనిపించింది, కొంచెం దగ్గరకు వెళ్లేసరికి అది చేపలా అనిపించింది. అయితే అతను చాలా జాగ్రత్తగా ఈ జీవిని పరిశీలించాడు. అప్పుడు అది చేప కాదు, ఆక్టోపస్ కూడా కాదని గుర్తించాడు.
మునుపెన్నడూ చూడని వింత జీవి కావడంతో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ తర్వాత నెటిజన్లు కామెంట్లతో సందడి చేస్తున్నారు. జెంకిన్సన్ ఈ జీవిని ‘ఏలియన్’ అని సరదాగా వర్ణించాడు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..