Viral Video: ఎంతకు తెగించార్రా.. రీల్స్ పిచ్చితో ప్రాణాలు తీస్తారా.. వందే భారత్ ట్రైన్‌కు అడ్డంగా..
వ్యూస్ కోసం ఏకంగా రైలునే ఆపేశారు..లైక్స్ కోసం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టారు. సోషల్ మీడియా రీల్స్ పిచ్చి దేశంలో ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. దేశంలోనే అత్యంత వేగవంతమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై చెక్క దుంగలు అడ్డుపెట్టి ఆ రైలును ఆపేసి కొందరు యువకులు చేసిన పైశాచికానందం పొందారు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైక్స్ కోసం కొందరు ఎంతటి తెగింపుకైనా వెళ్తున్నారు. కొందరు యువకులు కేవలం ఒక వీడియో కోసం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టారు. దేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి, వారు చేసిన నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొందరు యువకులు రైల్వే పట్టాలపై పెద్ద పెద్ద చెక్క దుంగలను ఉంచారు. అంతటి వేగంతో వచ్చే వందే భారత్ రైలు ఆ అడ్డంకులను చూసి మధ్యలోనే ఆగిపోయింది. రైలు ఆగగానే ఆ యువకులు నవ్వుతూ, కేకలు వేస్తూ వందే భారత్ రైలును ఆపేశాం అంటూ పైశాచికానందం పొందారు.
రైలు ఆగిపోవడంతో లోపల ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారేమో అని వారి వద్దకు వెళ్లాడు. అప్పుడు ఆ యువకులు ఏమాత్రం భయం లేకుండా.. తాము లోపలికి రావడం లేదని, కేవలం వీడియో షూట్ చేస్తున్నామని కెమెరా ముందు నవ్వుతూ బదులిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు ఒక్కసారిగా మండిపడ్డారు. రైల్వే అధికారులను, కేంద్ర రైల్వే మంత్రిని ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం చిలిపి పని కాదు, వందలాది మంది ప్రాణాలతో చెలగాటమాడటం. దీనిని ఉగ్రవాద చర్యగా పరిగణించాలి” అని ఒక యూజర్ కామెంట్ చేశారు. రీల్స్ పిచ్చితో ఇలాంటి పనులు చేసే వారిపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించాలి అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రతకు పొంచి ఉన్న ముప్పు
కేవలం కంటెంట్ కోసం పట్టాలపై అడ్డంకులు సృష్టించడం వల్ల రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉందని, ఇది తీవ్రమైన నేరమని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో పేరు కోసం చేస్తున్న ఇలాంటి నిర్లక్ష్యపు విన్యాసాలు సామాన్య ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో రైల్వే అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ యువకులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా విచారణ మొదలైనట్లు సమాచారం.
Stopping Vandey Bharat and jeopardising lives of passengers by placing wooden logs for making reels, should be treated as an act of terrorism.
Request @RailMinIndia and @RPF_INDIA to arrest them all and coordinate with state government to slap NSA on them. pic.twitter.com/KPxKCPqxRm
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) January 23, 2026
