అందంగా కనిపించడం కోసం చాలామంది ఫెయిర్‌నెస్ క్రీములు ఎక్కువగా వాడుతుంటారు. వాటి వాడకం వల్ల చర్మం కాంతివంతంగా.. అందంగా కనిపిస్తుంది. కానీ ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వాడకంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నాయి లేటెస్ట్ సర్వేలు. ముఖ్యంగా భారత్‌లో ఈ క్రీముల వాడకం వల్ల కిడ్నీ సమస్యలు బాగా పెరిగిపోయాయని తాజా అధ్యయనం వెల్లడించింది. అసలు ఫెయిర్‌నెస్ క్రీమ్‌లకు, కిడ్నీలకు ఉన్న సంబంధం ఏంటి.? ఎలా పాడవుతున్నాయి.? అనేది తెలుసుకుందాం.
మహిళలు.. ఈ మధ్య పురుషులు అందంగా కనిపించడం కోసం అనేక ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను వాడుతున్నారు. కానీ ఎక్కువకాలం ఇలాంటి క్రీమ్‌లు వాడటం వల్ల చర్మం ఇన్ఫెక్షన్‌కు గురవుతోందని అనేకమంది నిపుణులు, బ్యూటీషియన్లు చెబుతున్నారు. చర్మం ఉన్న తత్వాన్ని బట్టి కొందరు కొన్ని క్రీములు వాడాలి.. లేకపోతే వాడకూడదు అనేది వారి సలహా. చర్మానికి అప్లై చేసే ఈ క్రీమ్‌లలో ఉండే రసాయనాలు చర్మంతో పాటు మొత్తం శరీరానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కానీ లేటెస్ట్‌గా జరిగిన ఒక సర్వే రిపోర్ట్ గమనిస్తే.. ఫెయిర్‌నెస్ క్రీమ్‌లతో కిడ్నీలకు హాని తప్పదని చెప్తున్నాయి. ఇది ఎక్కువగా ఇండియాలోనే ఉందన్నది రిపోర్ట్ సారాంశం. ఈ క్రీమ్‌లలో ఉండే పాదరసం మూత్రపిండాలకు హాని కలిగిస్తున్నట్లు రిపోర్ట్ చెప్తోంది. చర్మం నిగారింపు కోసం యూజ్ చేసే ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వాడకం వల్ల మెంబ్రానస్ నెప్రోపతి కేసులు పెరుగుతున్నాయని.. దీని వల్ల కిడ్నీ ఫిల్టర్‌లను దెబ్బతీయడమే కాకుండా ప్రోటీన్ లీకేజ్‌కి కారణమవుతోందని తాజా అధ్యయనం తెలిపింది.
మెంబ్రానస్ నెప్రోపతి అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీని వల్ల నెప్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. ఇది మూత్రంలో ఎక్కువ ప్రోటీన్ విసర్జించేలా చేస్తుంది. 2021 జులై నుంచి 2023 సెప్టెంబర్ మధ్యకాలంలో నమోదైన 22 మెంబ్రానస్ నెప్రోపతి కేసులను ఈ సర్వేలో భాగంగా పరీక్షించారు. చర్మం ద్వారా పాదరసం శరీరంలోకి వెళ్లి మూత్రపిండాల ఫిల్టర్లను ప్రభావితం చేస్తుందని ఇది నెప్రోటిక్ సిండ్రోమ్ కేసులు పెరగడానికి దారితీస్తుందని పరిశోధకులు తెలిపారు. దేశీయ మార్కెట్లో ఈ క్రీములు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయని.. ఈ క్రీములు చర్మ నిగారింపు విషయంలో త్వరగా ప్రభావం చూపుతాయన్న ప్రచారం వల్ల చాలామంది ఇలాంటివి ఉపయోగిస్తున్నారని పరిశోధకులు తెలిపారు.