
భారతదేశంలో అత్యంత కఠినమైన యుపిఎస్సి (UPSC) పరీక్ష కోసం ఒక అభ్యర్థి ఎనిమిదేళ్లపాటు శ్రమించి, చివరకు గురుగ్రామ్‌లో రూ. 18,000ల చిన్న ఉద్యోగంలో చేరిన హృదయవిదారక కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరవిందర్ కౌర్ అనే మహిళా అభ్యర్థి తన సుదీర్ఘ ప్రిపరేషన్ తర్వాత ఆశించిన లక్ష్యం నెరవేరకపోవడంతో ఎదుర్కొన్న మానసిక వేదనను పంచుకున్నారు. జీవితంలో అత్యంత విలువైన యువతరాన్ని (Prime Time) ఈ పరీక్ష కోసం త్యాగం చేసి, చివరకు కల చెదిరిపోయినప్పుడు లైఫ్‌లో మూవ్ ఆన్ కావడం ఎంత కష్టమో ఆమె వివరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
హరవిందర్ కౌర్ అనే ఒక యూపీఎస్సీ అభ్యర్థి తన జీవితంలోని అత్యంత విలువైన 8 సంవత్సరాల కాలాన్ని సివిల్స్ ప్రిపరేషన్‌కే అంకితం చేశారు. రాత్రింబగళ్లు కష్టపడి చదివినప్పటికీ ఆమెకు ఆశించిన ఫలితం దక్కలేదు. చివరకు జీవితంలో ముందుకు సాగక తప్పని పరిస్థితుల్లో, ఆమె గురుగ్రామ్ (గుర్గావ్) లో కేవలం రూ. 18,000ల జీతంతో ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో తన కలలు ఎలా ముక్కలయ్యాయో, ఆ బాధ ఎంత భరించరానిదో ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఈ పరీక్షలో సుమారు 10 లక్షల మంది పోటీ పడితే, అందులో మెయిన్స్ పరీక్షకు కేవలం 14-15 వేల మంది మాత్రమే అర్హత సాధిస్తారు. ఇంటర్వ్యూ దశకు చేరుకునేది 2-3 వేల మంది కాగా, అంతిమంగా ఎంపికయ్యేది కేవలం 800 నుండి 1000 మంది మాత్రమే. ఎంతో సీరియస్‌గా ప్రిపేర్ అయినప్పటికీ ఈ రేసులో వెనుకబడిపోయిన అభ్యర్థులకు జీవితంలో మూవ్ ఆన్ కావడం చాలా పెద్ద సవాలుగా మారుతుంది. ఎందుకంటే వారు తమ వయస్సులోని అత్యంత కీలకమైన వసంతాలను (Prime Time) పుస్తకాలకే పరిమితం చేస్తారు.
వీడియో ఇక్కడ చూడండి..
హరవిందర్ కౌర్ పంచుకున్న ఈ భావోద్వేగ ప్రయాణం వేలాది మంది నెటిజన్ల హృదయాలను తాకింది. కామెంట్ సెక్షన్‌లో ఎంతో మంది ఆమెకు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ విజయం అనేది ఎప్పుడూ ఒకే సరళరేఖలో సాగదు, దక్కితే దేవుడికి కృతజ్ఞత చెప్పాలి, దక్కకపోతే ఓపిక పట్టాలి (మిలే తో శుక్ర్ నా మిలే తో సబ్ర్)” అని రాశారు. మరణం సంభవించే వరకు జీవితంలో ఎదురయ్యే ఓటములన్నీ కేవలం మానసికమైనవే (Psychological) అని, ఆమె ఇక్కడితో ఆగిపోకుండా కొత్త బాటలో మరింత కష్టపడి పైకి ఎదగాలని కోరుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..