Upasana Konidela: లేట్ అవుతుంది! 30 ఏళ్ల లోపు ఎగ్ ఫ్రీజింగ్ చేయండి… యువతకు మెగా కోడలు సలహా!
ఈ రోజుల్లో యువత, ముఖ్యంగా మహిళలు కెరీర్‌ను టాప్ ప్రయారిటీగా పెట్టుకుంటున్నారు. బెస్ట్ జాబ్స్, స్టార్టప్‌లు, హైయర్ స్టడీస్, గ్లోబల్ ఆపర్చునిటీస్… ప్రతిదీ 20-30 మధ్య గేర్ మారుస్తుంది. వివాహం, పిల్లలు అనే ఆలోచనలు బ్యాక్ సీట్‌లో పడిపోతున్నాయి. కానీ ఒక రియాలిటీ ఎవరూ ..

ఈ రోజుల్లో యువత, ముఖ్యంగా మహిళలు కెరీర్‌ను టాప్ ప్రయారిటీగా పెట్టుకుంటున్నారు. బెస్ట్ జాబ్స్, స్టార్టప్‌లు, హైయర్ స్టడీస్, గ్లోబల్ ఆపర్చునిటీస్… ప్రతిదీ 20-30 మధ్య గేర్ మారుస్తుంది. వివాహం, పిల్లలు అనే ఆలోచనలు బ్యాక్ సీట్‌లో పడిపోతున్నాయి. కానీ ఒక రియాలిటీ ఎవరూ గట్టిగా చెప్పడం లేదు. మహిళల ఫెర్టిలిటీ విండో సన్నగిల్లుతుంది. 30 దాటితే ఎగ్స్ క్వాలిటీ తగ్గుతుంది, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ పెరుగుతాయి.
ఈ టెన్షన్‌ను దూరం చేసే ఒకే ఒక్క సొల్యూషన్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంద, అదే ఎగ్ ఫ్రీజింగ్! దీన్ని ‘బయోలాజికల్ క్లాక్‌ను పాజ్ చేయడం’ అంటారు. కెరీర్ టాప్ గేర్‌లో ఉన్నప్పుడు భవిష్యత్తు మదర్‌హుడ్‌ను సేఫ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ అని యువత మధ్య భారీ హైప్ నడుస్తోంది. ప్రియాంక చోప్రా, సెరెనా విలియమ్స్ లాంటి గ్లోబల్ ఐకాన్స్ నుంచి భారతీయ సెలబ్రిటీల వరకు దీన్ని ఓపెన్‌గా సపోర్ట్ చేస్తున్నారు.
ఎగ్ ఫ్రీజింగ్ బెస్ట్ ఆప్షన్..
ఇలాంటి సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరో భార్య, బిజినెస్ వుమన్, యువతకు రోల్ మోడల్… ఆమె ఒక్క మాటతో సోషల్ మీడియాను షేక్ చేశారు. ‘30లోపు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోండి… ఇది మహిళలకు అతిపెద్ద ఇన్సూరెన్స్. మీరు పిల్లలు ఎప్పుడు కావాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఆర్థికంగా స్వతంత్రులైతే మీ షరతుల్లోనే!’ అని గట్టిగా చెప్పుకొచ్చింది మెగా కోడలు రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల!
IIT హైదరాబాద్‌లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్‌లో తన ఎగ్ ఫ్రీజింగ్ అనుభవాన్ని పంచుకున్నారు ఉపాసన. ‘నేను స్వయం సంపాదకురాలిని. ఆర్థిక స్వాతంత్ర్యం నాకు ధైర్యం ఇచ్చింది. 23 ఏళ్లకే వివాహం చేసుకున్నా, 34 ఏళ్లకు క్లిన్ కారా పుట్టింది. ఎగ్ ఫ్రీజింగ్ సెక్యూరిటీ ఇచ్చింది, కానీ నేచురల్ ప్రెగ్నెన్సీ జరిగింది. ఇప్పుడు సెకండ్ బేబీ కోసం వెయిట్ చేస్తున్నా’ అని చెప్పారు.
ఆమె మాటలు వైరల్ అవ్వగానే రెండు వర్గాలుగా చర్చ మొదలైంది. ఒక వర్గం ‘అదిరిపోయింది! యువతకు రియల్ ఎంపవర్‌మెంట్’ అంటూ సపోర్ట్, మరో వర్గం ‘ఇది అందరికీ అందుబాటులో లేదు, ఖర్చు లక్షల్లో ఉంటుంది’ అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్థికంగా స్వతంత్రులైతే ఆ ఆప్షన్ తీసుకోవచ్చు. ఉపాసన మాటలు యువతను ఆలోచింపజేస్తున్నాయి. ఈ ఒక్క స్టేట్మెంట్తో మరోసారి వార్తల్లో నిలిచారు మెగా కోడలు ఉపాసన కొణిదెల!
